కడప

ప్రతి మహిళ నెలకు రూ.10వేలు సంపాదించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,అక్టోబర్ 15: ప్రతి మహిళ నెలకు రూ.10వేలు సంపాదించాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని, ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుని మహిళా రైతులు ఆర్థికంగా ఎదగాలని పశుసంవర్థక, మార్కెటింగ్ శాఖ మంత్రి సి.ఆదినారాయణరెడ్డి అన్నారు. వచ్చేనెల జిల్లాలో 5వేల ఎకరాలను మహిళల పేరుతో పంపిణీ చేసేందుకు సిద్ధం చేశామని మంత్రి అన్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో ‘మహిళారైతు దినోత్సవం-2018’ కార్యక్రమంలో మంత్రి ఆదినారాయణరెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. అంతకుముందు, సభాభవన్ వెలుపల వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్థక, మైక్రో, మత్స్య, ఐసీడీఎస్, ప్రకృతి వ్యవసాయం, కృషి విజ్ఞాన కేంద్రం శాఖలు ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను మంత్రి ఆదినారాయణరెడ్డి, కలెక్టర్ సి.హరికిరణ్‌లు సందర్శించారు. అనంతరం వీరిద్దరూ జ్యోతిప్రజ్వలన చేసి మహిళా రైతు దినోత్సవం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం మహిళల ఆర్థిక అభ్యున్నతికి అనేక సంక్షేమపథకాలు అమలుచేస్తోందని, వాటన్నింటినీ అందిపుచ్చుకుని మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలన్నారు. రైతు సంక్షేమం కోసం రాష్ట్రప్రభుత్వం రూ.19వేల కోట్లు కేటాయించిందన్నారు. జిల్లాలో 4.88 లక్షల సాగురైతుల్లో 1.6లక్షల మంది మహిళా రైతులు ఉన్నారని వీరు 1.77 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలను సాగుచేస్తున్నారని అన్నారు. వ్యవసాయంలో, పాడిపరిశ్రమలో మహిళలపాత్ర ప్రధానమని ఆయన అన్నారు. ఇంటిపట్టాలు, ఇళ్ల మంజూరు, మరుగుదొడ్లు, సూక్ష్మసేద్య పరికరాలు, పాడిపశువులు, డ్వాక్రా రుణాలు లాంటివన్నీ మహిళల పేరుతోనే ప్రభుత్వం మంజూరు చేస్తోందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ ఇంట్లో మహిళలు చేసే కష్టానికి గుర్తింపులేదని, వాస్తవానికి మగవాళ్లకన్నా మహిళలే ఎక్కువ పనిచేస్తున్నారన్నారు. నేటి సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు ఎక్కువయ్యాయని వాటిని నిరోధించాలన్నారు. గతంలో ఉన్న ఒరవడి మారుతోందని, ఇప్పుడు ప్రభుత్వ పథకాలన్నీ మహిళల పేరుతోనే ప్రభుత్వం ఇస్తోందన్నారు. రబీలో ఉపాధి పనులు చేసే వారిలో 60శాతం మహిళలే ఉన్నారని అన్నారు. జిల్లాలో 243 గ్రామాల్లో పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని అన్నారు. మహిళలు ధైర్యంగా ముందుకుసాగాలని వారు ఏ అభద్రతా భావానికి గురైనా జిల్లా యంత్రాంగం, పోలీసుయంత్రాంగం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ జేడీ మురళీకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది పంటల సాగు అంశాలపై వివరించారు. వ్యవసాయశాఖ తరపున ఇస్తున్న వివిధ శిక్షణలపై ప్రసంగించారు. కార్యక్రమం ప్రారంభంలో, వ్యవసాయంలో కృషిచేసి ఉన్నతి సాధించిన మహిళారైతులు సంబేపల్లెకు చెందిన మల్లవరపు సరస్వతీ, రాజుపాలెం మండలం పగిడాల గ్రామానికి చెందిన జయ సరస్వతమ్మ, మైలవరం మండలం చిన్నకొమర్ల గ్రామానికి చెందిన కె.లక్ష్మీదేవి, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న శివకుమారి, తృణధాన్యాలతో వ్యాపారం చేస్తున్న మహిళా రైతు పి.నిర్మలమ్మలు తమ అనుభవాలను వివరించారు.