వినమరుగైన

గణపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక ఇంటి యజమాని వీళ్ల కోరికని విని ‘అలాగే’నని కార్యక్రమం ముగిశాక వంటవారి చేత గణపతి కొల్లాయి గుడ్డతోనే పందిరి మంచపుకోడుకు కట్టించి ఈత చువ్వతో సన్మానం చేస్తాడు.
గణపతి జీవితచరిత్రలో మరొక ముఖ్యమైన ఘట్టం అతని మాష్టరు గిరి ఘట్టం. ‘‘కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల యొజ్జయై యుండిన’ విఘ్నేశ్వరునిలా మన గణపతి కూడా బడిపంతులు అవతరాన్నికూడా ఎత్తుతాడు. పిల్లలకు ఇతగాడు విధించే శిక్షలు వింతగా తోస్తాయి. చేతులతో చరవటం, పిడిగుద్దులు గుద్దటం, తొడపాశం పెట్టడం, చెవులు మెలిపెట్టడం, చింతబరికలతో నెత్తురుచిమ్మేలా కొట్టటం, కోదండం తీయించటం వగైరా శిక్షలు గణపతిని విద్యార్థుల పాలిట సింహస్వప్నంగా మారుస్తాయి. అంతెందుకు? వంటవాడుగా అవతారం ఎత్తినా గణపతి తన్ను మరచిపోలేని విధంగా హింసించగలడు.
వినాయకుడు పెళ్లికి అన్నీ విఘ్నాలే అన్న సామెత కూడా గణపతి పట్ల నిజమయింది. కాకుంటే రెండుసార్లు పెళ్లయినా పెళ్లాం అతనికి దక్కకపోవటమేమిటి? మేనమామ కూతుర్ని రాక్షస వివాహం చేసుకున్నా, పిల్ల మెళ్లో పుస్తె తెంపేసి తర్వాత వేరే పెళ్లయినా చేస్తాడు కానీ, మేనమామ గణపతికి మాత్రం తన పిల్లను భార్యగా ఇవ్వటానికి అంగీకరించడు. అయితే ఆరుద్ర అన్నట్లు ‘గణపతికి పెళ్లాలు దక్కకపోయినా మనకు అతని చరిత్ర దక్కినందుకు సంతోషించాలి’’.
వినోదప్రధానంగా గణపతి తన నవల సాగిస్తున్నప్పటికీ చిలకమర్తి దీన్ని ఒక ప్రయోజనాన్ని ఆశించే వ్రాశారు. ఇందులో దారపు పోగులు చిక్కుపడినట్లు అనేక సామాజిక సమస్యలు ఒకదానిలో ఇంకొకటి పెనవేసుకొని కన్పించాయి.
ఆంధ్రదేశానికి ముక్కుపచ్చలారని పసికూనల్ని మూడుకాళ్ల ముదుసలివాళ్లకు ఇచ్చి వివాహం చేసే దౌర్భాగ్యం ఎప్పుడు పట్టిందో తెలియదు. తల్లి పొత్తిళ్లలో ఉన్న పసికందులకూ, పురటి వాసన తీరని చిన్నారి తల్లులకూ వివాహమా? చిలకమర్తివారు ఈ సంప్రదాయాన్ని పరోక్షంగా దుయ్యబట్టటం మనం ఈ నవలలో గమనిస్తాం. పాపయ్య, గంగాధరుడు, గణపతి లాంటివాళ్లు ఇందుకు సిద్ధమవటం; పుల్లయ్య, మహదేవశాస్ర్తీ లాంటివాళ్లు మధ్యవర్తిత్వం చెయ్యటం చూశాక ఎంత లోతుగా ఈ సంప్రదాయం తెలుగు గడ్డలో పాతుకుపోయిందో తెలుస్తుంది.
ఈ నవలలో చిత్రింపబడిన మరో సమస్య కన్యాశుల్కం. కటిక దారిద్య్రాన్ని అనుభవించే తల్లిదండ్రులు కన్యాశుల్కం తీసుకొని తమ కుమార్తెలను వయసు మీరిపోయిన వాళ్లతో వివాహం చేయటం ఈ నవలలో మనకు కన్పిస్తుంది. భార్య పుష్పవతి అయిన నాటికి భర్త యాభై పడిలో పడటం, ఆ వయసులో వారికి పునః సంధానమవటం చూశాక కళ్లు చెమ్మగిల్లి తీరతాయి.
శ్రాద్ధాలు నిర్వహించడం, కావిడి కుండల్తో నీళ్లుమోయడం, శవాలను మోయడం ఇలా జానెడు పొట్ట నింపుకునేందుకు ఒక వర్గంవారు పడే అగచాట్లూ, అభ్యంతరకరమైన అలవాట్లు ఈ నవలలో చాలా హృదయ విదారకంగా చూపబడ్డాయి.

*
సశేషం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-మాదిరాజు రామలింగేశ్వరరావు