శ్రీకాకుళం

పలాసకు మరోసారి విచ్చేసిన సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, అక్టోబర్ 16: తిత్లీ తుపాన్ బాధితులకు పూర్తిగా మనోధైర్యం కల్పించిన తర్వాత పలాస నుంచి వెళ్తానని భీష్మించుకున్న సీ ఎం చంద్రబాబునాయుడు విజయవాడ కనకదుర్గాకు పట్టువస్త్రాలు సమర్పించాల్సిన నేపథ్యంలో విజయవాడకు వెళ్లారు. విజయవాడ నుంచి నేరుగా మంగళవారం పలాస ప్రభుత్వ జూనియర్‌కాలేజి క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. సీ ఎం పేషీయా కార్యాలయం నుంచి పలాసకు 11 గంటలకు చేరుకుంటారని టూర్‌షెడ్యూల్ విడుదల చేసినస్పటికి 12 గంటలకు పలాసకు చేరుకున్నారు. సీ ఎం హెలికాప్టర్ దిగి ఎస్పీ, డి ఐజీ, ఎపీ ఇడిపి సీ ఎల్ సీ ఎండి హెచ్ వై దొరతో కొద్దిసేపు మాట్లాడి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుకు చేరుకున్నారు. సీ ఎం వస్తున్నారని తెలుసుకున్న పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ సీ ఎంను కలిసి తిత్లీ తుపాన్‌తో మెళియాపుట్టి మండలం తీవ్రంగా నష్టపోయిందని, విచ్చేయాలని వినతిపత్రం అందజేసారు. పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందరశివాజీ సీ ఎం బస్సును ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా సీ ఎంతో కలిసి ముందుగా నిర్ణయించిన ప్రకారం మందస కాకుండా మొదటిసారి పర్యటించిన అక్కుపల్లి, పల్లిసారధి, గరుడభద్రలో పర్యటించాలని కోరడంతో సీ ఎం అంగీకారం తెలిపి కాన్వాయ్‌ను అటువైపు మళ్లించారు. తిత్లీ తుపాన్ తర్వాత సీ ఎం పర్యటించిన ప్రాంతాల్లో ఏ మేరకు సహాయక చర్యలు జరిగాయో తెలుసుకునేందుకు అటు వైపు వెళ్లిన సీ ఎం సుముఖత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయసమాచారం. మొదటిసారి పర్యటనకు, ఇప్పటి పర్యటనకు కొద్దిసేపు వ్యత్యాసం తప్పితే పూర్తిస్థాయిలో సహాయక చర్యలు అందలేదని ఆ ప్రాంతీయులు సీ ఎం ఎదుట బాహాటంగా తీవ్ర ఆరోపణలు చేయడంతో సీ ఎం ఒకింత అసహనం వ్యక్తం చేస్తూ మీకు న్యాయం చేస్తామని తీవ్రస్వరంతో సీ ఎం వారిని మందలించారు. సీ ఎం రాకతో బాధితులకు ఎటువంటి ప్రయోజనం కలగడం లేదని, సీ ఎం వెనుక ఆర్భాటాలు తప్పితే సహాయక చర్యలపై దృష్టి సారించడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. హూదూద్ తుపాన్‌లో మహానగరం విశాఖపట్నాన్ని వారం రోజుల్లో పునరుద్దరణ చేసిన అధికారులు ఆరుమండలాలు కలిపిన విశాఖ అంతా ఉండకపోయినప్పటికి సహాయకచర్యల్లో జాప్యం చేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.

మున్సిపాలిటీలో ఎంపీ రాము ద్విచక్రవాహనంపై పర్యటన
పలాస, అక్టోబర్ 16: పలాస మున్సిపాలిటీలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు మంగళవారం ద్విచక్రవాహనంపై పలు ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మమేకమై ప్రతి ఒక్కరికి సహాయం అందించిన తర్వాత తాము ఇక్కడ నుంచి వెళ్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిత్లీ తుపాన్‌తో శ్రీకాకుళానికి భారీ విపత్తు సంభవించినా కేంద్రం స్పందించకపోవడం దురదృష్టకరమని, సీ ఎం చంద్రబాబునాయుడు మనోధైర్యంతో తుపాన్ బాధితులకు భరోసా కల్పిస్తున్నారన్నారు. అనంతరం పలు ప్రాంతాల్లో తుపాన్ బాధితులను నిత్యావసర సరుకులను అందించారు. ఎంపీ సరుకులు అందించడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తూ మీలాంటి నాయకుడు ఉండబట్టే మేము ఇంత ధైర్యంగా ఉన్నామని ప్రజలు నీరాజనాలు పలికారు. ప్రతి ఒక్క బాధితుడుకు సహాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈయనతోపాటు మాజీ మున్సిపల్ చైర్మన్ వజ్జ బాబురావు, టీడీపీ నాయకులు లోడగల కామేశ్వరరావు, పైల చక్రధర్, సూర్యనారాయణ, గాలి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

పంట నష్టం గుర్తింపులో పారదర్శకత చూపించాలి
* రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్
సరుబుజ్జిలి, అక్టోబర్ 16: శ్రీకాకుళం జిల్లాలో సంభవించిన తిత్లీ తుపాను, వంశధర వరదముంపుతో నష్టపోయిన పంట నష్టాల గుర్తింపులో అధికారులు పారదర్శకత పాటించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ పి.మురళీధర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని వంశధార నదీ పరివాహక ప్రాంత వరదముంపు ప్రాంతాల్లో పర్యటించారు. సింధువాడ, వీరమల్లిపేట, పెద్దసవలాపురం ముంపు ప్రాంతాల్లో నష్టపోయిన పంటలను పరిశీలించారు. వీరమల్లిపేట జంక్షన్ వద్ద ఆయన వరద పరిస్థితి, వరి పంట ముంపు వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అలాగే మండలంలో తిత్లీ తుపాను, వంశధర వరదముంపుతో ఏయే గ్రామాల్లో ఎంతవరకు నష్టం వాటిల్లి ఉండవచ్చునని మండల వ్యవసాయాధికారి ఎం.శ్రీనివాసబాబును అడిగి తెలుసుకున్నారు. సింధువాడ గ్రామం వద్ద మాజీ సర్పంచ్ గోవింద వెంకట శివానందమూర్తి, టీడీపీ నాయకులు మీసాల రామారావు, రామకృష్ణ, వ్యవసాయ శాఖ కమిషనర్‌ను కలిసి వంశధార వరదనీరు తమ గ్రామాలకు చెందిన పంట పొలాల్లో సుమారు నాలుగు రోజులు నిల్వా ఉండిపోవడం వల్ల పొలాలు ఎర్ర మట్టితో దిబ్బ వేశాయన్నారు. దీని వల్ల వరి పైరు పొట్ట దశలో పోవడమే కాకుండా ఇతర పంటలు వేసుకోవడానికి వీలు కలగదన్నారు. తుపాను బాధిత రైతులందరికీ న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, ఎటువంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని కమిషనర్ రైతులకు హామీనిచ్చారు.

ఆపదలో వున్న బాధితులను ఆదుకుంటాం
మందస, అక్టోబర్ 16: తిత్లీ తుపాన్‌తో సర్వం కోల్పోయి ఆపదలో వున్న బాధితులందరిని ఆదుకుంటామని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీషా అన్నారు. మంగళవారం అంబుగాం, రాంపురం, నారాయణపురం, సువర్ణపురం, సరియాపల్లి పంచాయతీల గ్రామాల్లో జీడి, కొబ్బరిచెట్లు నేలకొరిగిన ఇళ్లును పరిశీలించారు. ఉద్దానంలో తుపాన్ పెనుప్రమాదం సంభవించడం ఉద్దాన ప్రజలు జీవనాధారం కోల్పోయి నిరాశ్రయులుగా మారి ఆపదలో ఉండడం బాధాకరమన్నారు. ప్రభుత్వం బాధితులందరికి ఆదుకుంటుందని, ప్రతి కుటుంబానికి రేషన్‌సరుకులు, ఎన్‌టి ఆర్ గృహాలు, మృతి చెందిన గొర్రెలకు, మేకలకు నష్టపరిహారం అందజేస్తామన్నారు. ఈమెతోపాటు టీడీపీ నాయకులు జికె నాయుడు, దుర్యోదన, ఆర్.లింగరాజు, కర్రయ్య, పి.వాసు, దుర్వాసులు, రుద్రయ్య తదితరులు పాల్గొన్నారు.