క్రైమ్/లీగల్

ఎమ్మెల్యే బలాలపై మాదన్నపేటలో, మజ్లిస్ శ్రేణులపై మూడు ఠాణాల్లో కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్, నవంబర్ 15: నామినేషన్ ర్యాలీలో అనుమతులు మీరడంతో మజ్లిస్ మలక్‌పేట మాజీ ఎమ్మెల్యే అహ్మద్ బలాలపై మాదన్నపేటలో కేసు నమోదైంది. మజ్లిస్ నాయకులపై కూడా మూడు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం నామినేషన్ ర్యాలీ నిర్వహించిన మలక్‌పేట మజ్లిస్ అభ్యర్థి మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతి లేకుండా ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించినందుకు కేసు నమోదైంది. నిషేధిత డ్రోన్ కెమెరాల వినియోగం, అక్బర్‌బాగ్‌లో స్వాగత వేదిక ఏర్పాటు, ర్యాలీలో అనుమతికి మించి వాహనాల సంఖ్య విషయమై చాదర్‌ఘాట్ ఠాణాలో పలువురు మజ్లిస్ కార్యకర్తలపై 3 కేసులు నమోదయ్యాయి. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించటం, భారీగా వాహనాలను ర్యాలీలో వినియోగించటంపై సైదాబాద్ ఠాణాలో రెండు కేసులు నమోదయ్యాయి.