రంగారెడ్డి

కార్మికులను మోసం చేసిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయత్‌నగర్, నవంబర్ 15: కార్మికులను నమ్మించి మోసం చేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్పాలని సీఐటీయూ రాష్ట్రప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబా పిలుపునిచ్చారు. రంగారెడ్డిజిల్లా సీఐటీయూ కమిటీ ఆధ్వర్యంలో గురువారం తుర్కయంజాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు, ప్రత్యామ్నాయ విధానాలు, కార్మికవర్గ పాత్ర అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన సాయిబాబా మాట్లాడుతూ కార్మికులు అందరు ఐక్యంగా ఉంటూ బీఎల్‌ఎఫ్ బలపర్చిన అభ్యర్థిని గెలిపించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, నాయకులు చంద్రమోహన్, కిషన్, జగదీష్, రాజు, కవిత, దత్తునాయక్, ప్రభాకర్, యాదగిరి, కృష్ణ పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే టీఆర్‌ఎస్ గెలుపునకు పునాది
జీడిమెట్ల, నవంబర్ 15: ప్రజా సంక్షేమమే టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు పునాది అని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేక్ అన్నారు. కుత్బుల్లాపూర్ డివిజన్ ఎన్‌టీఆర్ నగర్, బాల్ రెడ్డినగర్, శ్రీరామ్‌నగర్, బాపూనగర్ తదితర ప్రాంతాల్లో ముమ్మర ప్రచారం చేశారు. ప్రచారానికి ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటువేసి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. మహిళలు వివేక్‌కు మంగళ హారతులతో స్వాగతం పలికారు. టీఆర్‌ఎస్‌ను గెలిపించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. నాలుగేళ్ల కాలంలో చేసిన అభివృద్ధికి ప్రజలు ఓటు వేస్తారని ధీమాను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర టీఆర్‌ఎస్ నేత కేఎం ప్రతాప్, కార్పొరేటర్ రావుల శేషగిరి, సత్యనారాయణ, నాయకులు మల్లేష్ యాదవ్, నర్సింహా యాదవ్, సుదర్శన్ రెడ్డి, సంపత్ యాదవ్, బాలయ్య పాల్గొన్నారు. పలు కాలనీలకు చెందిన శేఖర్ రావు, ఐలయ్య, కుమార్ యాదవ్, వెంకటేశ్, సురేశ్, బుజ్జమ్మ, ఊర్మిళ, లక్ష్మీ, కృష్ణరెడ్డి, దిగంబర్ రావు, కుమార్, యాదగిరి, ఆంజనేయులు, లక్ష్మీ నారాయణ, వెంకట్ రావు, సిద్ధిరాములు, పరమానంద రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు.
టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు
రంగారెడ్డి నగర్ డివిజన్ గురుమూర్తి నగర్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు పెద్దసంఖ్యలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. చింతల్ డివిజన్ వల్లభాయ్ పటేల్ నగర్‌కు చెందిన టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ ఖండువాలను కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్‌లు విజయశేఖర్ గౌడ్, రషీదా బేగం, నాయకులు వెంకటేశ్వర రావు, కిషన్ రావు, రఫీక్, సయ్యద్ మజర్, నవాబ్, అర్షద్, కిషోర్‌చారి పాల్గొన్నారు.
అభ్యర్థిని గెలిపించేందుకు నేతల ప్రచారం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేక్‌ను గెలిపించేందుకు వివిధ డివిజన్‌లు, గ్రామాల్లో పార్టీ నేతలు ముమ్మర ప్రచారం చేపట్టారు. గాజులరామారం సర్కిల్ పరిధిలోని జగద్గిరిగుట్ట డివిజన్ దేవమ్మబస్తీలో కార్పొరేటర్ జగన్ ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలను పంచి కారు గుర్తుకు ఓటు వేసీ వివేక్‌ను గెలిపించాలని అభ్యర్థించారు. రంగారెడ్డి నగర్ డివిజన్ ఇందిరా గాంధీనగర్, సౌభాగ్యనగర్‌లలో కార్పొరేటర్ విజయ శేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో ముమ్మర ప్రచారం చేశారు. జీడిమెట్ల డివిజన్ యాదిరెడ్డి బండ, రంగారెడ్డి బండ, గంగా ఎన్‌క్లేవ్ గుడిసెలలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ యువజన నేత కేపీ విశాల్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేక్‌ను గెలిపించాలని కోరుతూ ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు.

జోన్లలో శానిటరీ జవాన్ల బదిలీ
ఉప్పల్, నవంబర్ 15: పరిశుభ్రత, పచ్చదనంలో నెంబర్ వన్ పురపాలక సంఘంగా నిలిచిన బోడుప్పల్‌లో మెరుగైన సేవలు నిర్వహించాలని శానటరీ విభాగం అధికారులు నిర్ణయించారు. ఇప్పటికీ దేశ స్థాయిలో అవార్డు దక్కించుకున్న అధికారులు మున్ముందు మరిన్ని అవార్డులు దక్కించుకునేందుకు ముందుకు వెళ్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో పని చేస్తున్న అధికారులు శానిటరీ విభాగంలో మెరుగైన సేవలు అందించడానికి జవాన్లను జోన్ల వారీగా బదిలీ చేశారు. గురువారం జవాన్లు, చెత్త ఆటో డ్రైవర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన శానటరీ విభాగం ఇన్‌స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి.. పరిశుభ్రత, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. దినం విడిచి దినం ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించాలని, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలని తెలిపారు. జవాన్లు బాల్‌నర్సయ్య, అంజయ్య, నవీన్, శ్రీనివాస్, నరేష్, అశోక్, వినోద్‌ను కేటాయించిన జోన్లలో సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

శరత్ క్యాపిటల్‌లో లైఫ్ స్టైయిల్ స్టోర్
గచ్చిబౌలి, నవంబర్ 15: దేశంలో ఫ్యాషన్‌కు ప్రముఖ గమ్యస్థానమైన లైఫ్‌స్టయిల్ తన నూతన స్టోర్‌ను కొండాపూర్‌లోని శరత్ సిటీ క్యాపిటల్‌లో ప్రారంభించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ టైగర్ ష్రాఫ్ ప్రారంభించారు. తనకు ఇష్టమైన లైఫ్‌స్టయిల్ స్టోర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందని టైగర్ ష్రాఫ్ అన్నారు. కార్యక్రమంలో లైఫ్‌స్టయిల్ మేనేజింగ్ డైరెక్టర్ వసంత్ కుమార్ పాల్గొన్నారు.