గుంటూరు

జగన్‌పై దాడిలో ప్రభుత్వమే అసలు ముద్దాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 16: ప్రతిపక్ష జగన్మోహనరెడ్డిపై జరిగిన దాడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే అసలు మద్దాయి అని వైసీపీ నేతలు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పట్ట్భాపురంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్ష, సమన్వయకర్తలు రావి వెంకట రమణ, కిలారి రోశయ్య, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నంలు మాట్లాడారు. గతంలో జగన్‌పై తప్పుడు కేసులు బనాయించేందుకు సీబీఐ విచారణ చేయాలని నాడు చెప్పిన చంద్రబాబు నేడు ఆయనపై జరిగిన దాడిలో సీబీఐ విచారణ తాము కోరుకుంటే ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. కేంద్రప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. సీబీఐ అధికారులు రాష్ట్రంలోకి రావాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందేనని బాబు ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని, అందుకే బాబు వెన్నులో వణుకు పుడుతోందన్నారు. బాబుకు అవినీతి పాలన తప్ప పారదర్శక పాలన గురించి తెలియదన్నారు. సీఎం ప్రసార మాద్యమాలను అడ్డం పెట్టుకుని తాను చెప్పిందే నిజమని ప్రజలకు మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని టీడీపీ నేతలు లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీబీఐ అధికారుల దాడుల్లో ముఖ్యమంత్రులు సైతం పట్టుబడి జైలుకు వెళ్లిన సంఘటనలు అనేకం ఉన్నాయని చెప్పారు. తన ఉనికిని కాపాడుకునేందుకే బాబు దేశ పర్యటనలు చేపట్టారని ఎద్దేవాచేశారు. ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆతుకూరి ఆంజనేయులు, కోనూరు సతీష్‌శర్మ, మేడా సాంబశివరావు, అంగడి శ్రీనివాసరావు, నిమ్మరాజు శారదాలక్ష్మి, అర్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.