ఆంధ్రప్రదేశ్‌

ఆప్కో పనితీరు అధ్వాన్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, మార్చి 30: ఆప్కో చైర్మన్, పాలక మండలి, అధికారుల పనితీరు తీవ్ర ఆక్షేపణీయంగా ఉందని బుధవారం మంగళగిరి పట్టణ శివారులోని ఎర్రబాలెం వద్దగల ఆప్కో తోట (డిఎంఓ ఆఫీసు) ప్రాంగణంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంఘం లిమిటెడ్ (ఆప్కో) 32వ సర్వసభ్య సమావేశంలో పలువురు సభ్యులు చైర్మన్ మురుగుడు హనుమంతరావును, అధికారులను నిలదీశారు. సమావేశానికి ఆప్కోచైర్మన్ మురుగుడు హనుమంతరావు అధ్యక్షత వహించారు. చైర్మన్ మురుగుడు హనుమంతరావు అధ్యక్షోపన్యాసం ప్రారంభించి చేనేత సహకార సంఘాలకు ఆప్కో చెల్లించాల్సిన బకాయిలను గత ఆగస్టుమాసం వరకు క్లియర్ చేయడం జరిగిందని పేర్కొనడంతో సభ్యులు విరూపాక్ష, చంద్రయ్య, మరో సభ్యుడు తీవ్ర ఆగ్రహావేశాలతో చైర్మన్ ప్రసంగానికి అడ్డు తగిలారు. ఒక సభ్యుడు చైర్మన్ మురుగుడును ఉద్దేశించి గత ఏడాది మార్చి బకాయే విడుదల చేయలేదని, ఆగస్టు వరకు చెల్లించామని చెప్పడం తప్పుడు లెక్క అని అన్నారు. నువ్వొచ్చాక ఒక్క పేమెంట్ కూడా రాలేదని చైర్మన్ మురుగుడునుద్దేశించి సభ్యులు పేర్కొనడంతో ఆయన కొన్ని నిమిషాలపాటు షాక్‌కు గురికావడంతో ఆయన నుంచి మైకు తీసుకున్న ఆప్కో ఎండి భాషా వివరణ ఇస్తూ గత అర్ధరాత్రి వరకు రాసిన చెక్కుల్లో ఆగస్టు వరకు బకాయిలు క్లియర్ చేశామని, రేపోమాపో మీకు అందిస్తామని చెప్పడంతో శాంతించారు. చేనేత సహకార సంఘాలకు కోట్లాది రూపాయలు బకాయిలు ఉండగా దాని గురించి పట్టించు కోకుండా ఆప్కో ఉద్యోగులకు వేతనాలు 60, 70 వేల రూపాయల వరకు పెంచారని ఇది చాలా తప్పని విరూపాక్ష అన్నారు. ఎండి భాషా స్పందిస్తూ ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు తగ్గించడం ఆప్కో అధికారులు, పాలకవర్గం చేతుల్లో లేదని, కొత్తగా నియమించుకునే వారికి తక్కువ వేతనాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం చైర్మన్ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత ఇబ్బందులు ఏర్పడ్డాయని, ఇబ్బందులను అధిగమించి ఆప్కోను నడుపుతున్నామని, వీలైనంత త్వరగా బకాయిలు చెల్లిస్తామని, తెలంగాణాలో 79 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో వందకోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని అన్నారు.
మంగళగిరిలో 4.32 ఎకరాల భూమి ఆప్కోకు ఉందని, గతంలో 11.32 ఎకరాలు ఉండేదని, ఏడెకరాలు విక్రయించారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకై 32వ సర్వసభ్య సమావేశం ఇక్కడ ఏర్పాటు చేశామని చైర్మన్ మురుగుడు పేర్కొన్నారు. ఆప్కో ఎండి భాషా మాట్లాడుతూ ప్రతి జిల్లాలో ఆప్కో వస్త్ర విక్రయాలకు మెగా షోరూంలు ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామని, అన్ని జిల్లా కలెక్టర్లకు స్థలాల కోసం లేఖలు రాశామని వివరించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి విచ్చేసిన ప్రాథమిక చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, సభ్యులు ఎక్కువ మంది ఆప్కోపాలక మండలి తీరుపై నిరసన వ్యక్తం చేశారు. సమావేశంలో పాలకమండలి డైరెక్టర్లు పాల్గొన్నారు.

‘బ్రాండిక్స్ ఓ పెద్ద కుంభకోణం’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 30: వైజాగ్‌లో ఉన్న బ్రాండిక్స్ దుస్తుల తయారీ పరిశ్రమలో పనిచేస్తున్న 18వేల మంది కార్మికుల పొట్టగొట్టడానికి కార్మిక శాఖ సహకరించిందని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. కార్మికులకు కనీస వేతనాలను నిర్ధారిస్తొ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న వేతనాలు ప్రభుత్వం జారీ చేసిన జీవో 362లో లేవని వేతనాలు తగ్గించి జీవో ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఫలితంగా 2011 నుండి ఏడా 72 కోట్లు చొప్పున ఐదేళ్లలో కార్మికులు 360 కోట్లు నష్టపోయారని , ఇదో పెద్ద కుంభకోణమని విష్ణుకుమార్ రాజు అన్నారు. అప్పటి ప్రభుత్వంలో ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న వారికి ముడుపులు అందడం వల్లనే అంతా వౌనం వహిస్తున్నారని అన్నారు.ఈ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.