చిత్తూరు

బీసీల సంక్షేమానికి బాబు చేసిన కృషి మరెవరూ చేయలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 17: రాష్ట్రంలో బీసీల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కృషి ఇప్పటివరకు ఏ పార్టీ చేయలేదని తుడా చైర్మన్ నరసింహయాదవ్ అన్నారు. తుడా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2017-18లో బీసీ సబ్ ప్లాన్ కోసం 37 విభాగాల ద్వారా రూ.10వేల కోట్లు ఖర్చు చేసారన్నారు. అలాగే 2018-19 సంవత్సరానికి రూ. 11వేల కోట్లు కేటాయించి సబ్‌ప్లాన్ అమలు చేస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఆదరణ పథకం కింద 90శాతం సబ్సిడీతో 4లక్షల మందికి రూ.750 కోట్లతో పనిముట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎన్‌టి ఆర్ విద్యోన్నతి పథకం కింద 2018-19లోనే 2500 మంది విద్యార్థులను సివిల్ కోచింగ్‌కు పంపారని, 12017-18లో 1843 మంది విద్యార్థులను కోచింగ్‌కు పంపించామన్నారు. రాష్ట్రంలో బీసీ గురుకుల పాఠశాలల 31, కళాశాలలు 2 ఉంటే బాబు సీఎం అయ్యాక గురుకుల పాఠశాలలకు ప్రాధాన్యత ఇస్తూ గత సంవత్సరం 10 స్కూల్స్ ఏర్పాటు చేస్తే ఇందులో ఆరు మత్స్యకారుల కోసం ఏర్పాటు చేసారన్నారు. ఈ సంవత్సరం 65 గురుకులాలు ఏర్పాటు చేస్తే ఇందులో 10 జూనియర్ కళాశాలలను నిర్మించారన్నారు. హాస్టల్ విద్యార్థులకు అందిస్తున్న మెస్ చార్జీలను గణనీయంగా పెంచిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని, విద్యార్థులకు పౌష్టికాహారం అందించే దిశగా మెనూలో వారానికి మూడు సార్లు చికెన్ పెట్టాలని ఆదేశించారని ఆయన చెప్పారు. బీసీల సంక్షేమానికి 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.9497.88 కోట్లు కేటాయించి రూ.8490 కోట్లు విడుదల చేసి, రూ. 7815 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఇక తెలుగుదేశం ప్రభుత్వం కేవలం నాలుగేళ్లలో రూ. 16403.86 కోట్లు కేటాయించి, రూ.15917.35 కోట్లు విడుదల చేసి, రూ.14246.42 కోట్లు ఖర్చు చేసారని చెప్పారు. సంవత్సరానికి రూ. 3561.61 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని నరసింహ యాదవ్ వివరించారు. ఇక బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ ద్వారా 28.72 లక్షల మందికి రూ.4004.84 కోట్లు కేటాయించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు అధికప్రాధాన్యత ఇచ్చి వారి సంక్షేమానికి ఏ ప్రభుత్వం కేటాయించనన్ని నిధులు కేటాయించారన్నారు. అయితే ప్రతిపక్షాలు అసత్యప్రచారాలు చేస్తూ బీసీలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని బీసీలకు టీడీపీ మేలు చేస్తే వైకాపా, జనసేన ఇతర పార్టీలు మాత్రం చేసిన మేలును మరచి దుమ్మెత్తి పోయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. వీటిని ప్రజలు నమ్మరని చెప్పారు.