రాష్ట్రీయం

భక్తి, విశ్వాసం భగవత్సన్నిధికి సోపానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, నవంబర్ 20: భక్తి, విశ్వాసం భగవత్సన్నిధికి సోపానాలని సత్యసాయి సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమీష్ పాండే పేర్కొన్నారు. పుట్టపర్తి సత్యసాయి 93వ జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రశాంతినిలయంలో లివింగ్ విత్ సత్యసాయి అనే రెండు రోజుల అంతర్జాతీయ సదస్సులో నిమీష్ పాండే ప్రసంగిస్తూ సత్యసాయితో జీవించడమంటే ఆయన పట్ల బలమైన విశ్వాసంతో కూడిన పునాదులు ఏర్పరచుకోవడం, తద్వారా సాయిప్రేమకు పాత్రులవ్వడమేనన్నారు. సత్యసాయి బోధనలు ఆచరించి పాటించడం అంటే మనిషి సత్ప్రవర్తనకు మార్గం సుగమమైనట్టేనన్నారు. మనిషి లక్ష్యసాధనకు ఆధ్యాత్మిక చింతన దిక్సూచి లాంటిదన్నారు. శ్రవణం, కీర్తనం, పాదసేవనం, స్మరణం, ఆత్మనివేదనం, దాస్యం, సఖ్యం, వందనం లాంటి నవవిధమార్గాలను దైవకృపకు సోపానాలుగా అభివర్ణించారు. భగవత్‌తత్వం అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమేనన్నారు. సత్యసాయి బోధనలను విస్తృత పరచడం, వాటి సారాన్ని అందరికీ పంచాల్సిన బాధ్యత సాయిభక్తుల ముందున్న లక్ష్యమన్నారు. అందరిలో దాగి ఉన్న నిక్షిప్తశక్తిని వెలికితీయడం అంటే సత్యసాయి ఆధ్యాత్మిక ప్రకాశాన్ని పదుగురికి పంచడమేనన్నారు. ప్రతి ఒక్కరూ సాయి బోధనలు, సారాంశాలను అనుసరించడం ద్వారా జీవితాన్ని సాఫల్యం చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వేదనారాయణ గాయత్రి మంత్రం విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో సత్యసాయి ట్రస్టు సభ్యులు ఆర్‌జె రత్నాకర్, డాక్టర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..పుట్టపర్తిలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో
ప్రసంగిస్తున్న సత్యసాయి సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమీష్ పాండే