జాతీయ వార్తలు

అక్రమార్కులకు అండగా నిలిచించి మీరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు కేసులో అరెస్టయిన మధ్యవర్తి క్రిస్టియన్ మిచెల్‌తో కాంగ్రెస్‌కు సంబంధాలు అంటగట్టడం దయ్యాలు వేదాలను వల్లించినట్టుగా ఉందని, బీజేపీకి చెందిన పలువురు నేతలు అనేక కేసుల్లో అక్రమార్కులుగా ఉన్న విషయాన్ని ఆ పార్టీ మరచిపోయిందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ గురువారం విలేఖరులతో మాట్లాడుతూ 3600 కోట్ల వీవీఐపి అగస్టా హెలికాప్టర్ల కొనుగోలులో మధ్యవర్తిగా వ్యవహరించిన మిచెల్‌ను దుబాయ్ నుంచి మంగళవారం మనదేశానికి తీసుకువచ్చిన నేపథ్యంలో అతని తరఫున కోర్టుకు హాజరైన కాంగ్రెస్ యూత్ నేత, న్యాయవాది ఆల్జో కె.జోసఫ్‌ను పార్టీ నుంచి బహిహ్కరించినట్టు చెప్పారు. అయితే జోసఫ్ తమ పార్టీకి చెందిన వాడంటూ కుంభకోణం మకిలిని కాంగ్రెస్‌కు అంటగట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వాస్తవానికి ఆ పార్టీకి చెందిన నేతలే అవినీతిపరులకు సలహాదారులుగా, న్యాయవాదులుగా, బోర్డింగ్ పాస్, టికెట్ ఏజెంట్లు, పోలీస్‌ల నుంచి రక్షణ ఏజెంట్లుగా వ్యవహరించారని విమర్శించారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కుటుంబ సభ్యులు మెహల్ ఛోక్సీ నుంచి ఫీజు తీసుకోలేదా? కేంద్ర మంత్రి రవిశంకర్ సుబ్రతారాయ్ తరఫున, వసుంధర రాజె లండన్‌లోని లలిత్‌మోదీ తరఫున అఫిడవిట్ దాఖలు చేయలేదా అని ఆయన ప్రశ్నించారు. అలాగే స్టాక్‌బ్రోకర్ కేతర్ పరేఖ్ తరఫున జైట్లీ ప్రాతినిధ్యం వహించలేదా అని అన్నారు. ఇన్ని లోపాలు తమపై పెట్టుకున్న బీజేపీ వారు తమపై విమర్శలు చేయడం అర్థరహితమని ఆయన అన్నారు.