జాతీయ వార్తలు

రచయిత అమితవ్ ఘోష్‌కు జ్ఞానపీఠ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఈ సంవత్సరం జ్ఞానపీఠ అవార్డును ప్రముఖ ఆంగ్ల రచయిత అమితవ్ ఘోష్‌కు ప్రకటించారు. ఆయన రచించిన ‘అవుట్‌స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ లిటరేచర్’ అనే రచనకు 54వ జ్ఞానపీఠ అవార్డును అందజేస్తున్నట్టు భారతీయ జ్ఞానపీఠ్ శుక్రవారం ప్రకటించింది. జ్ఞానపీఠ ఎన్నిక కమిటీ చైర్మన్, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ప్రతిభారాయ్ ఆధ్వర్యంలో సమావేశమై రాయ్‌ని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. సంప్రదాయేతర మార్గంలో కొత్తఆలోచనలను తన రచనలలో ప్రతిబింబిస్తారని ఘోష్‌కు మంచి పేరుంది. చారిత్రక సన్నివేశాలను, ఆధునిక శకంతో సంధానం చేస్తూ ఆయన రచనలు సాగుతాయి. ఆయన రచనల్లోని లోతును పరిశీలిస్తే ఆయన ఒక చరిత్రకారుడిగా, మానవ శాస్తజ్ఞ్రుడిగా మనకు గోచరిస్తాడు. ముఖ్యంగా ఆయన రాసిన షాడో లైన్స్, ద గ్లాస్ పేలస్, ద హంగ్రీ డైడ్, సీ పాపిస్, రివర్ ఆఫ్ స్మోక్, ఫుడ్ ఆఫ్ ఫైర్ నవలలు మంచి ఆదరణ పొందాయి. ముఖ్యంగా 2016లో ఆయన రచించిన ‘ద గ్రేట్ డిపార్టుమెంట్’ నవలకు మంచి పేరు లభించింది. కాగా, ఘోష్ ఇదివరకే పద్మశ్రీ, సాహిత్య అకాడమీ అవార్డులను గెల్చుకున్నారు. ఈ సందర్భంగా తనకు ఈ అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఘోష్ ట్వీట్ చేశారు. ‘నిజంగా ఈ రోజు తనకెంతో ఆనందం కలిగించే దినం అని, ఈ సందర్భంగా తనను అభినందనలు తెలిపిన అభిమానులు, రచయితలు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.