ఆంధ్రప్రదేశ్‌

మిట్టపల్లె పంట పొలాల్లో పెద్దపులి సంచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, డిసెంబర్ 16 : నల్లమల అటవీ పరిధిలోని రుద్రవరం రేంజ్ ఆలమూరు సెక్షన్ మిట్టపల్లె బీట్‌లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అటవీ సమీపంలోని పంట పొలాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న నంద్యాల డీఎఫ్‌ఓ శివశంకర్‌రెడ్డి ఆదివారం పెద్దపులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించి పాదముద్రలు సేకరించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌ఓ మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణ కోసం మొబైల్ పార్టీ డీఆర్‌ఓ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ఐదుగురితో కలిపి రిస్క్ టీం ఏర్పాటు చేశామన్నారు. ఈ టీం నంద్యాల డివిజన్ పరిధిలో పని చేస్తుందన్నారు. కర్నూలు, కడప జిల్లాల సర్కిల్ కన్జర్వేటర్ గోపీనాథ్ ఆధ్వర్యంలో ఈ టీం పనిచేస్తోందన్నారు. నాగార్జున ప్రాజెక్టు టైగర్ సిబ్బందిచే కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశామని డీఎఫ్‌ఓ తెలిపారు.

చిత్రం..మిట్టపల్లె పంట పొలాల్లో సంచిరించిన పెద్దపులి పాదముద్రలు సేకరిస్తున్న అటవీ శాఖ అధికారులు