Others

‘ఈనాడే బాబు..’ (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1973లో దాసరి నారాయణరావుని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మాత రాఘవ నిర్మించిన కుటుంబ కథా చిత్రం ‘తాత-మనవడు’. ఈ సినిమా కోసం డాక్టర్ సి.నారాయణరెడ్డి రాసిన ఓ అద్భుత గీతం అంటే నాకు చాలాచాలా ఇష్టం. సినారె గీతానికి రమేష్‌నాయుడు స్వర రచన చేస్తే సుశీల మధురంగా, అర్ధవంతంగా గానంచేసిన ఆ గీతం శ్రవణానందమే కాదు ఆలోచనాత్మకం కూడా. అదే -ఈనాడే బాబూ నీ పుట్టిన రోజు అన్న గీతం. పిల్లల పుట్టినరోజున పెద్దలు సంబరాలు జరుపుతారు. నెలవంక పెరిగితే నింగికి ఆనందం, చిన్నబాబు ఎదిగితే కన్నవారికి ఆనందం, ఆకాశంలో వేయి చుక్కలున్నా ఒక్క చంద్రుడే చాలు.. అలాగే వంశాన్ని నిలబెట్టేవారొక్కరే చాలు అంటూ గీతంలో సినారె అందించిన పొందికైన భావాలు ఎంతో అర్థవంతంగా సాగుతాయ. సినారె సాహిత్య ప్రతిభకు దర్పణం అనదగ్గ పాటల్లో దీనికీ చోటుంటుంది. కన్నవారి కలలు తెలుసుకోవాలి/ ఆ కలలు కంట నీరు పెడితే తువడాలి.. అంటూ సంతానానికి ఆయనిచ్చిన సందేశం ఆసాంతం స్ఫూర్తిదాయకం. ముందుగా -తండ్రి మాటకై కానకు తరలిపోయే రాఘవుడు అందుకే ఆ మానవుడైనాడు దేవుడు, తల్లి చెరను విడిపించిన పక్షేంద్రుడు అంతటి మహనీయుడు, నువ్వూ ఆ బాటలోనే నడవాలి, ధృవతారగా నిలవాలి’ అంటూ చరిల్రో తమ తల్లిదండ్రుల సేవకోసం జీవితాలను అంకితం చేసిన వారి గురించి తెలియచేస్తాడు. తరువాత -పిల్లలు కన్నవారి కలలు తెలుసుకోవాలి/ ఆ కలల కంట నీరు పెడితే తుడవాలి/ తనకు తాను సుఖపడితే తప్పుకాకున్నా/ తనవారిని సుఖపెడితేనే ధన్యత ఓ నాన్న’ అంటూ పిల్లల బాధ్యత చెప్పిన తీరు అభినందనీయం. బాగా విద్యవంతులై, ఆర్థికంగా సంపన్నులైనా మంచి ఉద్యోగాలు చేస్తూ కూడా చాలామంది తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు తరలిస్తున్న నేటి సాంఘిక జీవనంలో ఈ పాట ఆవశ్యకత ఎంతైనా ఉంది. తమను ఉన్నతులుగా చేయడానికి ఎంతో కష్టపడి, త్యాగాలుచేసిన తల్లిదండ్రుల ఎడ పిల్లల బాధ్యతను వివరించిన ఈ గీతం సదాస్మరణీయం.

-సుసర్ల సర్వేశ్వరశాస్ర్తీ, విశాఖపట్నం