కడప

48వేల 708 సంఘాలకు చేకూరనున్న లబ్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప అర్బన్, జనవరి 23: రాబోయే సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకున్న తెలుగుదేశం ప్రభుత్వం మహిళా ఓట్లపై గాలం వేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ దిశగా ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా డ్వాక్రా సంఘాల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రతి మహిళకు రూ.10వేలు ఆర్థిక సహాయం వారి ఖాతాలోకి జమచేసేవిధంగా నిర్ణయాలు తీసుకురాబోతున్నారు. అలాగే సంఘంలో ఉన్న ప్రతి మహిళా సభ్యురాలుకు ఒక స్మార్ట్ఫోన్‌తోపాటు మూడేళ్లుపాటు ఫ్రీగా రీచార్జి బంపర్ ఆఫర్‌గా ప్రకటించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 4లక్షల 78వేల మంది డ్వాక్రా మహిళలకు సెల్‌ఫోన్లు అందనున్నాయి. 48వేల 708 సంఘాలకు ఒక్కో సభ్యురాలికి రూ.10వేలు చొప్పున లబ్దిచేకూరనుంది. జిల్లా వ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి పరిధిలో 35వేల 708 డ్వాక్రా సంఘాలుండగా, అందులో 3లక్షల 46వేల మంది సభ్యులున్నారు. అలాగే జిల్లాలోని కడప కార్పొరేషన్‌తోపాటు 8మున్సిపాల్టీల్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో ఒక లక్షా 32వేల మంది సభ్యులుండగా, 13వేల సంఘాలు పనిచేస్తున్నాయి. వీరందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించే ఎన్నికల వేళ వరాల జల్లులు అందనున్నాయి. ఎప్పటి నుంచో చంద్రబాబునాయుడులోని ఆలోచనలకు నేటికి ప్రణాళికా బద్దంగా చేపట్టేందుకు ముందడుగు పడింది. ఇప్పటికే పసుపు కుంకుమ కింద ‘పెట్టుబడి నిధిగా’ డ్వాక్రా మహిళలకు రూ.10వేలు చెక్కును చెల్లించగా, కొంతమందికి చెల్లింపులో ఆలస్యం జరగడంతో సంక్రాంతి కానుకగా మరో దఫా రూ.10వేలు వారి ఖాతాకు జమచేయబడింది. ప్రస్తుతం అందించబోనున్న రూ.10వేలు 2,3దశల్లో నేరుగా మహిళా ఖాతాలోకి జమచేయాలని ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఒక్కో గ్రామంలో ప్రతి 30కుటుంబాలకు ఒకరిని చొప్పున సాధికార మిత్రులను డ్వాక్రా సంఘాల నుంచే ఎంపికచేశారు. ఆ 30కుటుంబాలకు ప్రభుత్వం అందజేస్తున్న ఏదో ఒక పథకం లబ్దిచేకూరే విధంగా ముందస్తు ప్రణాళికా బద్ధంగా కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది. ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన హామీల్లో డ్వాక్రా సంఘాలు రద్దుచేస్తామని అప్పట్లో ప్రకటించింది. దీనివల్ల అప్పుతీసుకుని ఇంకా చెల్లించని వారికే లబ్దిచేకూరుతుందని, కష్టపడి రుణం తీర్చిన వారికి నష్టం జరుగుతుందని భావించిన ముఖ్యమంత్రి ప్రతి డ్వాక్రా మహిళలకు ప్రయోజనం అందేలా నిపుణులతో చర్చించి రూపకల్పన చేసిన పథకమే ‘పెట్టుబడి నిధి’. దీనినే పసుపు కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళకు రూ.10వేలు అందించనున్నారు. 16నెలల పొదుపుమొత్తంతో సమానం కానుంది. కార్పస్ నిధి పెరగడం వల్ల స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా ఎక్కువ మొత్తంలో రుణం లభిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.