గుంటూరు

శైవక్షేత్రాలకు వెయ్యి బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), జనవరి 23: జిల్లాలోని వివిధ శైవక్షేతాల్రకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 1000 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రాంతీయ అధికారి సుమంత్ ఆర్ ఆదోని పేర్కొన్నారు. బుధవారం ఎన్‌టిఆర్ బస్‌స్టేషన్‌లో గల తిక్కన సమావేశ మందిరంలో మహాశివ రాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ సీనియర్, జూనియర్ స్కేల్ ఆఫీసర్‌లు, 13 డిపోల మేనేజర్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం ఆదోని మాట్లాడుతూ గుంటూరు జిల్లాలోని అన్ని శైవక్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచామన్నారు. కోటప్పకొండ జాతరకు నర్సరావుపేట, చిలకలూరిపేట డిపోల నుండి 450 బస్సులను నడుపుతున్నామన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. నర్సరావుపేట, చిలకలూరిపేట డిపోల నుండి వచ్చే బస్సుల మార్గాల్లో సమస్యాత్మక ప్రాంతాల వద్ద ఆర్టీసీ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆర్టీసీ ఏర్పాటుచేసిన 6 బేస్ క్యాంప్‌లతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కోటప్పకొండపైకి ఘాట్‌రోడ్డులో తిరుగు డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ కల్పించడం జరిగిందని, అర్ధరాత్రి సమయంలో ఆర్టీసీ సిబ్బంది ఎక్కడా బస్సు ఆపకుండా తిరిగేందుకు రూట్‌లలో స్క్వాడ్‌లను ఏర్పాటుచేశామన్నారు. అలాగే ఆయా బేస్ క్యాంప్‌లలో ప్రయాణికులకు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేసి, అన్నివేళలా మంచినీటి సదుపాయం కూడా కల్పిస్తున్నామన్నారు. అలాగే జిల్లా నలుమూలల నుండి శ్రీశైల పుణ్యక్షేత్రానికి కూడా 82 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని జరిపే కోటప్పకొండ జాతరకు ఏపీఎస్ ఆర్టీసీ అన్ని విధాలా సిద్ధంగా ఉందన్నారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా మొబైల్ టీమ్‌లను కేటాయిస్తూ టిక్కెట్లు ఇచ్చే విధానంలో క్యూలైన్లు ఏర్పాటుచేసి ఎన్నడూ లేనివిధంగా ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టిసారించామని ఆర్‌ఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో సహాయ ఉప సిటిఎంలు వై రాజశేఖర్, ఎం భాస్కర్, ఉప సిఎంఇ శరత్‌బాబు, జిల్లాలోని 13 డిపోల మేనేజర్‌లు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.