తెలంగాణ

వేధింపులు భరించలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: గురుకులాల్లో పనిచేయడం చాలా కష్టమైపోతోందని, గురుకులాల్లో వేధింపులు ఎక్కువయ్యాయని, దీంతో టీచర్లు సైతం సరిగా పనిచేయలేకపోతున్నారని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షుడు సీహెచ్ రాములు, ప్రధానకార్యదర్శి చావ రవి పేర్కొన్నారు. పనివేళలు లేవని, సౌకర్యాలు లేవని, రక్షణ కూడా కరవైందని, ఆర్టీఐని అమలుచేయడం లేదని వారు చెప్పారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘం నేతలు వివిధ గురుకులాల కార్యదర్శులకు వినతి పత్రాలను అందించారు. గురుకులాల్లో విద్యా హక్కు చట్టాన్ని అమలుచేయాలని, అదనపు విధులు నిర్వహిస్తున్న వారికి అదనపు అలవెన్స్‌లు చెల్లించాలని, రక్షణ , భద్రతా సమస్యల దృష్ట్యా జనావాసాలకు దూరంగా ఉన్న పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులను రాత్రివేళల్లో పర్యవేక్షక అధ్యయన విధుల నుండి తొలగించాలని అన్నారు. ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు వీక్లీఆఫ్‌లు వర్తింపచేయాలని, కేర్ టేకర్‌గా రాత్రివేళ విధులు నిర్వహించిన టీచర్లు మరుసటి రోజు ఉదయమే ముందుగా వెళ్లిపోయే అవకాశం కల్పించాలని వారు సూచించారు. అర్హత ఉన్న టీచర్లకు సెలవులను అవసరం మేరకు వినియోగించుకోవడానికి అనుమతించాలని, ఐదు ఆప్షనల్ సెలువులను ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా లేదా విద్యాసంస్థ వారీ వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని అన్నారు. కాంట్రాక్టు టీచర్ల సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని అన్నారు. గెస్టు టీచర్లు, పార్టుటైం టీచర్లు పేరు ఏదైనా పూర్తి సమయం పనిచేస్తున్నందున వారికి తమ పోస్టుకు సంబంధించి పూర్తి వేతనం ఇవ్వాలని చెప్పారు.అన్ని విద్యాలయాలకు వెంటనే శాశ్వత భవనాలు నిర్మించాలని, అద్దె భవనాల్లో విద్యార్ధులకు సరిపడా వాష్‌రూమ్‌లు, డార్మిటరీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్ని యాజమాన్యాలకు కలిపి గురుకులాల కామన్ డైరెక్టరేట్‌ను నెలకోల్పాలని, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పారు. నియామకం సందర్భంగా ఉపాధ్యాయుల నుండి తీసుకున్న సెక్యూరిటీ బాండ్లను రద్దు చేయాలని, రీజనల్ హెల్త్ అండ్ శానిటేషన్ అధికారుల పోస్టులను రెగ్యులరైజ్ చేసి సివిల్ అసిస్టెంట్ సర్జన్‌తో సమానమైన వేతనం ఇవ్వాలని, అర్హత ఉన్న హెల్త్ సూపర్‌వైజర్లకు పదోన్నతి కల్పించాలని పేర్కొన్నారు.