తెలంగాణ

వర్షాకాలంలో వంద కోట్ల మొక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: వర్షా కాలంలో హరితహారం కార్యక్రమం ద్వారా 100 కోట్ల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషి ఆదేశించారు. హరితహారం రాష్టస్థ్రాయి స్టీరింగ్ కమిటీ సమావేశం సచివాలయంలో జోషి అధ్యక్షతన బుధవారం జరిగింది. అర్బన్ ఫార్కుల పురోగతి, కొత్తగా గ్రామపంచాయతీకి ఒకటి చొప్పున నర్సరీల ఏర్పాటు, మొక్కల పెంపకం, తదితర అంశాలపై సుదీర్ఘ చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అర్భన్ ఫారెస్ట్‌లు, అర్బన్ పార్కులు ప్రకృతి పునురుజ్జీవం కిందకు వస్తాని, అందువల్ల సిబ్బంది చక్కగా పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం తరంతో పాటు భవిష్యత్తు తరాలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించేందుకు పచ్చదనం బాగా ఉండాలని, కనీసం 33 శాతం విస్తీర్ణలో పచ్చదనం ఉండాలన్న ఉద్దేశంతో పనులు చేస్తున్నామన్నారు. అడవులు, పంచాయతీరాజ్, మున్సిపల్ వ్యవహారాలు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధుల్లో నర్సరీలను పెంచడంపై సంబంధిత అధికారులు శ్రద్ద తీసుకోవాలని జోషి కోరారు. వాతావరణం, భూముల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏ రకమైన మొక్కలు నాటాలో నిర్ణయించాలన్నారు. పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉండగా, 2,206 పంచాయతీల్లో అటవీ శాఖ నర్సరీలు ఉన్నాయన్నారు. మరో 9,868 పంచాయతీల్లో నర్సరీల ఏర్పాటు వేగంగా సాగుతోందన్నారు. పట్టణాల్లోని వార్డులు, డివిజన్లనలో ఒక్కో నర్సరీ ఉండేలా చూస్తామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. రాజధాని చుట్టుపక్కల 59 అర్బన్ ఫారెస్ట్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. వచ్చే సమావేశం వరకు అర్బన్ పార్కులకు సంబంధించి ఒక ప్రణాళిక రూపొందించి తనకు అందించాలని జోషి ఆదేశించారు. అటవీ శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ వ్యవహారాలు, రోడ్లు, భవనాలు, పరిశ్రమలు, టూరిజం, జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ మెట్రో తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..హరితహారంపై అధికారులతో సమీక్షిస్తున్న సీఎస్ జోషి