డైలీ సీరియల్

విష్ణుమాయకు అతీతులెవరు? -4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేసేది లేక మంత్రి పురోహితులు వాటిని రాజుగారికి చూపారు. అందులో మిరుమిట్లు గొలుపుతున్న ఓ కిరీటాన్ని చూసి ఆశ్చర్యంతో ఆహా ఎంత బాగుందో ఈకిరీటం అంటూ దాన్ని ముట్టుకుని తన తలపై పెట్టుకొన్నాడు. అక్కడున్నవారంతా ఏమి ముప్పువాటిల్లుతుందో కదా అని మనసున ఆందోళన పడ్డారు. అంతలోనే మరలా అయ్యో దీనిని స్పృశించకూడదని తాతలు చట్టం చేశారు కదా. మరి నాకెందుకు ఇవి అంటూ వెంటనే తీసేసి వెనక్కు వచ్చేశాడు పరీక్షిత్తు.
ఉత్సాహంతో వేటాడుతున్న మహారాజు పరీక్షిత్తు చాలా దూరం మృగాలను తరుముతూ ముందుకెళ్లి పోయాడు. మహారాజు వేగాన్ని సైన్యం అందుకోలేకపోతోంది. మధ్యాహ్న మార్తాండుడు తీవ్రంగా ఉన్నాడు. మహారాజు ఓ అడవిపందిని వేటాడుతూ ముందుకు చాలా దూరం వెళ్లి ఆ అడవి పంది కనిపించలేదు కాని దాహార్తి అలమటించి పోయాడు. వెనక్కుతిరిగి చూస్తే అక్కడ తన పరివారం కనుచూపు మేరలో కనిపించలేదు.వెంటనే అక్కడెక్కడైనా జలాశయాలు ఉన్నాయేమో అని చూశాడు. అతనికి దగ్గరలో ఓ ఆశ్రమం కనిపించింది. అది శమీకుని ఆశ్రమం. తన గుర్రం దిగి పరీక్ష్మీన్మహారాజు ఆ ఆశ్రమంలోకి వెళ్లాడు.
మనుషులెవరూ కనబడలేదు. శమీకుడు అర్థనిమీలిత నేత్రుడై సమాధి అవస్థలో తపస్సు చేసుకొంటున్నాడు. పరీక్షిత్తు ఆ ఋషిని చూశాడు. అలసటతో, శారీరిక శ్రమతో, దాహార్తితో డస్సి పోయి ‘నీళ్లు.. నీళ్లు’ అని అడిగాడు. సమాధిస్థితిలో ఉన్న ఆ మునీశ్వరుడు పరీక్షిన్మహారాజు ను చూడలేదు. పట్టించుకోలేదు. ఆయనకు బాహ్యస్మృతి లేదు. ఇవేమీ పట్టించుకోని పరీక్షిత్తు మళ్లీ మళ్లీ నీళ్లు అడిగాడు. కానీ ఆ ముని ఉలుకు పలుకూ లేకుండా ఉండేసరికి పరీక్షిత్తు కోపోద్రిక్తుడైయ్యాడు. అమితమైన కోపం తెచ్చుకుని ఇంతటి మహారాజు వచ్చి నీళ్లు అడిగితే కళ్లు తెరవడా? అంటూ పక్కనే చచ్చిపడి ఉన్న పామును చూసి దాన్ని తన వింటి కొప్పుతో తీసి ఆ శమీకుని మెడమీద వేసేసి కోపంతో వెనక్కు తిరిగి వచ్చేశాడు.
అక్కడే ఆడుకుంటూ తిరుగుతున్న మునికుమారులు రాజు వచ్చింది చూడలేదు, ఆయన అడిగింది వినలేదు కానీ రాజు పామును శమీకుని మీద వేయడం చూసి దానిని శమీకుని కొడుకైన శృంగికి చెప్పారు.
శృంగి ఆడుతున్న ఆటను వదిలి పరుగెత్తుకు వచ్చేశాడు.
అయ్యో తండ్రీ! ఇపుడు ఈ పామును తీయడం ఎలా అని పెద్దగా ఏడ్చాడు. పైగా విపరీతమైన కోపం తో ఈ రాజులందరూ మదోన్మత్తులై దేశాలను ఏలుతున్నారు. వీరికి కండకావరం ఎక్కువైంది అంటూ అమాయకుడైన నా తండ్రి, ముక్కుమూసుకొని తపస్సు చేసుకొంటున్న నా తండ్రిపై ఇంతటి దుర్మార్గపు పని చేస్తాడా? మేమేమన్నా రాజుల కొలువు కూటములకు వెళ్లామా? వారికి దానాలు ఇవ్వమని అడిగామా? ఎందుకు ఇలాంటి బుద్ధిపుట్టింది. ఇంతటి ఘోరకృత్యాన్ని చేశాడు కనుక అతను కూడా ఈరోజుటి ఏడవ నాడు విషతుల్యమైన పాము కాటుకు గురై చనిపోవుగాక అని శపించాడు.
- ఇంకాఉంది

డా. రాయసం లక్ష్మి