జాతీయ వార్తలు

8 లోక్‌సభ స్థానాల్లో ఏఐఏడీఎంకే, డీఎంకే హోరాహోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 18: తమిళనాట బద్ధవిరోధులుగా ఉన్న అధికార ఏఐఏడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 8 స్థానాల్లో హోరాహోరీగా తలపడనున్నాయి. సౌత్ చెన్నై, కాంచీపురం (ఎస్సీ), తిరువన్నమలై, తిరునల్వేలి, మైలాదుతురై, సేలం, నీలగిరీస్ (ఎస్సీ), పొలాచిలో ఈ రెండు పార్టీలు బలంగా పోటీపడనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 39 పార్లమెంటు స్థానాల్లో 20 చోట్ల ఏఐఏడీఎంకే, డీఎంకే పోటీపడుతున్నాయి. మిగిలిన 19 స్థానాలను తమ భాగస్వామ్య కూటమి పక్షాలకు సీట్లను కేటాయించాయి. ఈ రెండు ప్రధాన పార్టీలు పోటీ చేసే స్థానాల్లో ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఆదివారం ప్రకటించాయి. ఆయా స్థానాల్లో లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం.తంబిదురై (ఏఐఏడీఎంకే), రాజ్యసభ సభ్యురాలు కనిమొళి (డీఎంకే) తరఫున పోటీ చేస్తున్న అగ్ర నాయకుల్లో ఉన్నారు. కరూర్‌లో జరిగే ఉపఎన్నికలో లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై పోటీ పడుతుండగా, ప్రస్తుతం ఎంపీలుగా కొనసాగుతున్న పి.వేణుగోపాల్, జే.జయవర్ధన్ తమ పాత స్థానాలైన తిరువల్లూర్ (ఎస్సీ), సౌత్ చెన్నై స్థానాల నుంచి మళ్లీ బరిలోకి దిగుతున్నారు. ఉప ముఖ్యమంత్రి తనయుడు పి.రవీంద్రనాథ్ కుమార్, ఏఐఏడీఎంకే కోఆర్డినేటర్ ఓ.పన్నీర్‌సెల్వమ్ థెనీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. అధికార ఏఐఏడీఎంకే తమ భాగస్వామ్య కూటమి పక్షాలకు 19 స్థానాలు కేటాయించింది. ఈ కూటమిలో బీజేపీ, పాత్తలి మక్కల్ కట్చి (పీఎంకే) తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆదివారం రాత్రి పార్టీ ప్రధాన కార్యాలయంలో వెల్లడించారు. తమ పార్టీ తరఫున సెంట్రల్ చెన్నై నుంచి దయానిధి మారన్ పోటీ చేస్తారని ప్రధాన ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్ ప్రకటించారు. అదేవిధంగగా ఏ.రాజా నీల్‌గిరిస్ (ఎస్సీ) నుంచి, టి.ఆర్.బాలు శ్రీపెరంబుదూర్ స్థానం నుంచి పోటీ చేస్తారని ఆయన తెలిపారు. ఈ రెండు స్థానాల్లో 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వారిద్దరూ గెలుపొందారని ఆయన తెలిపారు. డీఎంకే చీఫ్ స్టాలిన్ చెల్లెలు, రాజ్యసభ సభ్యురాలు కనిమోజి సదరన్ తమిళనాడులోని టుటికొరిన్ లోక్‌సభ స్థానం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఆమె రాజ్యసభ పదవీకాలం ఈ ఏడాది జూలైతో ముగియనున్న నేపథ్యంలో పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తారని పార్టీ అధ్యక్షుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 39 లోక్‌సభ స్థానాల్లో 20 స్థానాల్లో పోటీ చేస్తున్న డీఎంకే రానున్న ఎన్నికల్లో 12 మంది కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పిస్తోంది. మిగిలిన 19 సీట్లలో తమ పార్టీ భాగస్వామి కూటమి కాంగ్రెస్ సహా మిగిలిన పార్టీలకు విడిచిపెట్టినట్టు స్టాలిన్ తెలిపారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే 34 స్థానాల్లో పోటీపడగా కనీసం ఒక్కచోట కూడా విజయం సాధించలేకపోయింది. అదేసమయంలో పార్టీ ప్రధాన ప్రత్యర్థి ఏఐఏడీఎంకే మొత్తం 37 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా కనీసం ఒక్క సీటును కూడా దక్కించుకోలేకపోయింది.