ఆంధ్రప్రదేశ్‌

బాబుతో బైరెడ్డి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 20: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రాయలసీమ సీనియర్ రాజకీయవేత్త బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఇరువురు ఏకాంతంగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. కర్నూలు జిల్లాలో విజయావకాశాలపై బాబు ఆరా తీశారు. జిల్లాలో టీడీపీ అభ్యర్థుల విజయానికి శాయశక్తులా కృషి చేస్తామని బైరెడ్డి స్పష్టం చేశారు. కాగా కర్నూలు జిల్లా నందికొట్కూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఐజయ్య తన అనుచరులతో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. మంత్రి ఫరూక్‌తో ఉండవల్లి వచ్చిన ఐజయ్యకు చంద్రబాబు టీడీపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉండగా విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గానికి చెందిన పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఆ పార్టీకి రాజీనామాచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. నియోజకవర్గ నేత ప్రగడ నాగేశ్వరరావు ప్రస్తుత టీడీపీ అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబుతో కలసి ఉండవల్లిలో ముఖ్యమంత్రిని కలిశారు. నాగేశ్వరరావుతో పాటు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి బి ప్రసాద్, ఎంపీపీ దాసరి గౌరిలక్ష్మి, ఎంపీటీసీ అన్నం వెంకట్రావు, సర్పంచ్ అల్లు కృష్ణ, ఇంకా పలువురు జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు టీడీపీలో చేరారు. ప్రజాదరణ చూసే టీడీపీలో చేరుతున్నట్లు వారు స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపుగా మరోసారి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్న కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, చిత్రంలో మంత్రి ఫరూక్, సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి