Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలా, ఎలాగోలాగ నదిని దాటేశారు ఆపై తమతమ పాదాల వంక చూసుకున్నారు.
ఆశ్చర్యం! వారి పాదాలు తడిసిలేవు. ఒక్క నీటి చుక్క కూడా ఆ పాదాలనంటి లేదు. పైగా అవి పారిజాతాల్లా పరీమళాల్నీ వెదజల్లుతూ, పున్నమనాటి చంద్రబింబాల్లా కాంతులీనుతున్నాయి.
వాళ్ళ ఆశ్చర్యానికి అవధుల్లేవు. అదేమి వింతో వారికర్థం కాలేదు. వెనుదిరిగి నది వంక చూశారు.
విచిత్రం! అక్కడ నది కూడా లేదు. కానీ, దాని స్థానంలో ఒక వెలుగుల వెల్లువ కనిపించింది.
వారు అవాక్కయి పోయారు! శిలాప్రతిమల్లా నిలుచున్నారు! తమతమ మనసుల్లో రాధాకృష్ణుల్ని తలచుకున్నారు.
వెంటనే ఆ వెలుగుల వెల్లువలోంచి రాధాదేవి ప్రత్యక్షమయింది.
అప్పుడు వారంతా ఆ రాధకు ప్రణమిల్లి, ఆమె చుట్టూ భక్తితో తిరిగారు.
‘‘దేవీ! ఏమిటీ విచిత్రం? ఎక్కడికీ ప్రయాణం’’?...అంటూ ఆసక్తితో ప్రశ్నించారు.
ఆమె ప్రసన్నవదనంతో---
‘‘్భగవంతుని ఆరాధన పూర్తయింది. కానీ భక్తుల ఆరాధనే పూర్తికాలేదు. అందుకే నా ఆరాధన అసంపూర్తిగా మిగిలిపోయింది.
అందుకే మీ దారికాస్తూ నిల్చున్నాను’’అంది ఆనంద భాష్పాల్ని రాలుస్తూ!
వాళ్ళకర్థం కాలేదు. ముఖాలు చూసుకున్నారు.
ఆమె చిరునవ్వుల్ని చిందిస్తూ-
‘‘శ్రీ కృష్ణపరమాత్మకి అభిషేకం చేసి ఆరాధించాను. ఇప్పుడు మీ పాదప్రక్షాళన గావించాను. నా పూజ పూర్తయింది. ఇప్పుడు నాకెంతో సంతృప్తిగా ఉంది.’’
అంది ఆమె అరమోడ్పు కన్నులతో!
ఆమె వారికి పాదాభివందనం చేసింది!
తన నునువెచ్చని కౌగిట్లో చేర్చుకుంది వాళ్ళది!
వాళ్ళకు తెలియకుండానే ఆమె కౌగిట్లో ఆ రాత్రంతా కరిగిపోయారు వారు.

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087