జాతీయ వార్తలు

బలమైన ప్రభుత్వంతోనే భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాకోట్/అమ్రేలీ, ఏప్రిల్ 18: ఇటు గుజరాత్‌లోదూ, అటు కర్నాటకలోనూ జరిగిన ఎన్నికల సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కర్నాటకలో జరిగిన ఓ సభలో ఉదాటించారు. కాంగ్రెస్ - జెడీఎస్ కూటమి ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కుమార స్వామి నిస్సహాస్థితిలో పడిపోయారని మోదీ అన్నారు. బలమైన ప్రభుత్వం కావాలంటే ఢిల్లీ వైపే చూపాలని, బలహీనమైన ప్రభుత్వానికి కర్నాటకే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ రకమైన నిస్సహా ప్రభుత్వాలే అవసరమని, ముఖ్యమంత్రి కుమార స్వామి పరిస్థితిని చూస్తే కాంగ్రెస్ ఉద్దేశ్యమేమిటో అర్థం అవుతుందని అన్నారు. తరచూ ముఖ్యమంత్రి కుమార స్వామి భావోద్వేగంతో మాట్లాడడం ఓ డ్రామా అని మోదీ అభివర్ణించారు. లక్షిత దాడులను కాంగ్రెస్ అంగీకరించడం లేదని పేర్కొన్న మోదీ, పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై దాడి జరిపి అక్కడి ఉగ్ర కేంద్రాలను ధ్వంసం చేయడం అన్నది భారత్ సాధించిన విజయంగా అభివర్ణించారు. అయితే కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలకు దేశ ప్రయోజనాల కంటే స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. గుజరాత్‌లో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడిన మోదీ సర్ధార్ పటేల్ భారీ విగ్రహ నిర్మాణం తొలి ప్రధాని నెహ్రూను తక్కువ చేసినట్టు కాదన్నారు. అమ్రేలీలో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడిన ఆయన ‘సర్ధార్ పటేల్ తమ నాయకుడు అని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. కానీ, ఆ పార్టీకి చెందిన నాయకుడెవరూ ఇంతవరకూ ఈ విగ్రహాన్ని సందర్శించలేదు’ అని అన్నారు. గత ఐదు సంవత్సరాల్లో దేశంలో శాంతి భద్రతలు బలంగా కొనసాగాయని, ఎక్కడా బాంబు పేలుళ్లు జరిగిన దాఖలాలు లేవన్నారు. కాశ్మీర్ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాకుండా ఉండిపోవడానికి కాంగ్రెస్ అనుసరించిన విధానాలే కారణమని తెలిపారు. గతంలో హైదరాబాద్, పూణే, కాశీ, జమ్మూ వంటి అనేక నగరాల్లో బాంబు పేలుళ్లు తరచూ సంభవించేవని, ఈ ఐదేళ్లలో ఒక్క పేలుడు కూడా జరగకపోవడానికి తమ ప్రభుత్వం కట్టుదిట్టమైన రీతిలో అమలు చేసిన భద్రతా విధానాలే కారణమని మోదీ అన్నారు. ఉగ్రవాదం అన్నది జమ్మూ కాశ్మీర్‌లో రెండున్నర జిల్లాలకే పరిమితమైందని, రాష్ట్రంలో ఎక్కడా కూడా ఉగ్రవాద సమస్య లేదని మోదీ తెలిపారు.

చిత్రం... అమ్రేలీలో గురువారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీకి పార్లమెంటు నమూనా
జ్ఞాపికను అందజేస్తున్న బీజేపీ కార్యకర్తలు