రాశిఫలం -04/22/2019

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిథి: 
బహుళ తదియ మ.1.22, కలియుగం - 5121 శాలివాహన శకం - 1941
నక్షత్రం: 
అనూరాధ సా.6.45
వర్జ్యం: 
రా.12.29 నుండి 2.07 వరకు విశేషాలు: సంకష్టహరచతుర్థి
దుర్ముహూర్తం: 
మ.12.24 నుండి 01.12 వరకు, తిరిగి మ.02.48 నుండి 03.36 వరకు
రాహు కాలం: 
ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలయడంలోవిఫలమవుతారు. వ్యయప్రయాసలు అధికమవుతాయి.వృథా ప్రయాణాలెక్కువ చేస్తారు.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. అనవసరంగా డబ్బు ఖర్చు అవుతుంది. మానసికాందోళన ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా పూర్తి చేసుకొంటారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడుతారు.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) ఆకస్మిక ధనలాభముంటంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరబంధువులు కలుసుకొంటారు. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. విదేశీయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) నూతనకార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంత వరకు అసత్యానికి దూరంగా ఉండాలి. అనవసర భయాందోళనలకు లోనవుతారు.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) మానసికానందం లభిస్తుంది. కొన్ని పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తిచేస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. మెలకువగా ఉండడం అవసరం. స్థాన చలనమేర్పడే అవకాశం ఉంది. ఋణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలుంటాయి.
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఏర్పడుతాయి. చెడుపనులకు దూరంగా ఉండాలి. అందరితో స్నేహంగా నుండడానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయప్రయాసలుంటాయి. వృథాప్రయాణాలెక్కువ చేస్తారు. మానసికాందోళన ఉంటుంది. బంధుమిత్రులతో కలహాలకు అవకాశమేర్పడవచ్చు. శారీరికంగా బలహీనులవుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) తోటివారితో విరోధ మేర్పడకుండా జాగ్రత్త వహించాలి. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలున్నాయి. వృథా ప్రయాణాలెక్కువ. కుటుంబ విషయాల్లో అనాసక్తిగా ఉంటారు. విశ్రాంతి తీసుకోవడం అవసరం. దై వ ప్రార్థన చేస్తారు.
కుంభం: 
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ధనలాభయోగముంటుంది. ప్రయత్నకార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు ఉత్సాహంగా ఉంటారు. స్ర్తిలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు.
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ధననష్టం ఏర్పడవచ్చు. వృధాప్రయాణాలెక్కువ చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా ఉండాలి. వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు.
Date: 
Monday, April 22, 2019
author: 
గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి