క్రీడాభూమి

సెరెనాకు ఫిట్నెస్ సమస్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 23: ప్రపంచ మాజీ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ ఫిట్నెస్ సమస్యతో బాధపడుతున్నది. ఆమె పూర్తిగా కోలుకుందా? లేదా? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం లభించడం లేదు. ఈనెల 26 నుంచి మొదలుకానున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్‌లో ఆడడం అనుమానంగానే కనిపిస్తున్నది. కెరీర్‌లో ఇప్పటి వరకూ 23 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను అందుకున్న సెరెనా, అత్యధిక టైటిళ్ల రికార్డుకు చేరువైంది. 24 టైటిళ్లతో మార్గరెట్ కోర్ట్ ప్రస్తుతం మొదటి స్థానంలో ఉండగా, సెరెనాది రెండో స్థానం. 2017 ఆస్ట్రేలియా ఓపెన్‌లో చివరిసారి గ్రాండ్ శ్లామ్ ట్రోఫీని అందుకున్న ఆమె, ఆ వెంటనే తాను గర్భవతినని ప్రకటించి, టెన్నిస్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఒక పాపకు జన్మనిచ్చిన తర్వాత, 2018 చివరిలో ఆమె మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను మొదలుపెట్టింది. మొదట్లో అద్భుతంగానే రాణించి, ఒకటిరెండు టోర్నీల్లో గెలిచినప్పటికీ, ఆతర్వాత క్రమంగా వెనుకబడింది. ఫామ్‌ను కోల్పోవడం ఒకవైపు, తరచు గాయాల బారిన పడడం మరోవైపు ఆమె కెరీర్‌ను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం మోకాలి నొప్పితో బాధపడుతున్న సెరెనా వైద్య సేవలు పొందుతున్నది. అయితే, ఎంత వరకూ కోలుకుంది? ఫ్రెంచ్ ఓపెన్ నాటికి బరిలోకి దిగుతుందా? లేదా? అనే ప్రశ్నలకు ఇంత వరకూ అధికారికంగా సమాధానాలు రావడం లేదు. ఒకటి రెండు రోజుల్లో ఆమె నుంచి ప్రకటన వస్తుందని ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు ఆశిస్తున్నారు.