ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్యే శ్రీ్ధర్‌రెడ్డి రెండోసారి ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 12: కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం ప్రొటెం స్పీకర్ శంబంగి చిన అప్పలనాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందులో భాగంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తూ దైవ సాక్షిగా, తన ఆరాధ్య నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని చదవడంతో అసెంబ్లీ అధికారులు సాంకేతికంగా అలా ప్రమాణం చేయడంపై అభ్యంతరం తెలిపారు. దీంతో శ్రీ్ధర్ రెడ్డి తప్పుగా పలికారని, మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రొటెం స్పీకర్ తెలిపారు. దీంతో మరోసారి దైవసాక్షిగా అంటూ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇలాఉంటే మొదటిసారి ప్రమాణం జగన్మోహన్‌రెడ్డి సాక్షిగా అంటూ చేసి, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణతో శ్రీ్ధర్‌రెడ్డి కరచాలనం చేయడం చర్చనీయాంశంగా మారింది.