రాష్ట్రీయం

వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం ఆదివారం ఘనంగా ముగిసింది. చివరిరోజు ఉభయ దేవేరులతో కలసి శ్రీ మలయప్ప స్వామివారు బంగారు కవచంలో పునర్ దర్శనమిచ్చారు. మళ్లీ జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయనాంచారులతో కలసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు, వేదపారాయణధారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీ మలయప్పస్వామి వారికి, దేవేరులకు స్నపన తిరుమంజనం చేపట్టారు. అనంతరం స్వర్ణకవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి స్వర్ణకవచ సమర్పణ వేడుకగా జరిగింది. అనంతరం సహస్రదీపాలంకార సేవలో స్వామి అమ్మవార్లు బంగారు కవచంలో దర్శనమిచ్చారు. ఆ తరువాత ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పేష్కార్ లోకనాథం, పార్‌పత్తేదార్ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

చిత్రం...జ్యేష్ఠాభిషేకం అనంతరం స్వర్ణకవచాలతో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి