రాష్ట్రీయం

బాధ్యతలు చేపట్టిన దినేశ్ కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: ఆంధ్ర రాష్ట్ర గ్రామీణాభివృద్ధికి పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, గ్రామీణ రంగంలో ఆదాయ మార్గాలు పెంచడంతో పాటు ఇంధన సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని ఆంధ్రా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఎఎస్ అధికారి దినేష్‌కుమార్ చెప్పారు.
బుధవారం ఆయన గ్రామీణ రంగం అభివృద్ధికి ఐదు పంచశీల సూత్రాలను ఆచరించనున్నట్లు చెప్పారు. శాస్ర్తియ విధానాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, గ్రామీణ పేదలకు జీవన భద్రత కల్పించడం, పర్యావరణ పరిరక్షణ, దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న ప్రజల ఆదాయాన్ని పెంచడం, ఇంధన సంరక్షణకు ప్రణాళిక రూపొందించి అమలు చేయడం చేస్తామన్నారు. ఎన్టీఆర్ జలసిరి, ప్రథధానమంత్రి కృషి సించారుూ యోజన, వాటర్‌షెడ్స్, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలుకు చర్యలుతీసుకుంటామన్నారు.ఎల్‌ఇడి బల్బులకు పాపులారిటీ కల్పించేందుకు డ్వాక్రా సంఘాల సేవలను ఉపయోగించుకుంటామన్నారు.