రాష్ట్రీయం

ఆపరేషన్ ముస్కాన్ డ్రైవ్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: రాష్ట్రం రోజురోజూకు మహిళలు, పిల్లల అదృశ్యాల ఘటనలపై సర్వత్రా వెల్లువెత్తుతున్న విమర్శలపై రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలకు సమాయత్తం అవుతోంది. అదృశ్యమైన వారిని గుర్తించి తల్లిదండ్రుల దగ్గరికి చేర్చడానికి ఆపరేషన్ ముస్‌కాన్-5 డ్రైవ్‌ను రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ పోలీస్ ప్రధాన కేంద్రంలో బుధవారం ఒకరోజు శిక్షణా తరగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ వచ్చే నెల జూలైలో నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్-5 డ్రైవ్‌ను అమలు చేయడానికి పోలీస్ యంత్రాంగం సన్నద్ధం కావాలని ఆయన పిలుపు ఇచ్చారు. ప్రతి పోలీస్ డివిజన్‌లో ఒక ఎస్‌ఐతో పాటు నలుగురు కానిస్టేబుల్స్ బృందం ఆపరేషన్ ముస్కాన్ డ్రైవ్‌లో పాల్గొనున్నారని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ ముస్‌కాన్‌పై 250 మంది పోలీసులకు అవగాహన కల్పించడానికి ఒక రోజు శిక్షణాతరగతిలో డీజీపీ పలు విషయాలను పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. గత జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్ డ్రైవ్‌లో మంచి ఫలితాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఏటా రెండు విడతలుగా చేపట్టే డ్రైవ్‌లో తప్పిపోయిన మహిలలు, పిల్లలను తల్లిదండ్రుల దగ్గరకు చేర్చడానికి వీలుకల్గుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామికవాడల్లో ఉన్న పరిశ్రమల్లో బాల కార్మికులు పని చేస్తున్నారని, వారిని గుర్తించడంతో పాటు పరిశ్రమల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మహేందర్‌రెడ్డి పోలీస్ అధికారులకు ఆదేశించారు. కార్మిక, ఆరోగ్య శాఖల సమన్వయంతో పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ డ్రైవ్ నిర్వహించాలని ఆయన సూచించారు. జిల్లాల్లో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో పాల్గొనే అధికారులకు అవగాహన కల్పిండానికి పోలీస్ యంత్రాంగం తగుచర్యలు తీసుకుంటుందన్నారు. ఆపరేషన్ స్మైల్, ముస్‌కాన్ డ్రైవ్ కార్యక్రమాలపై బుక్‌లెట్లను పంపిణీ చేయాలని ఆయన సూచించారు. బాల పరిరక్షణకు చేపట్టే న్యాయమైన అంశాలను సైతం అధికారుల బృందాలకు వివరించాలన్నారు. రాష్ట్ర ఇన్‌స్పెక్టర్ జనరల్ పోలీస్ అధికారిని స్వాతిలక్రా, మరో ఐపీఎస్ అధికారిణి సుమతి పోలీసులు చేపడుతున్న స్మైల్. ముస్కాన్ డ్రైవ్‌ల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయేందర్ బాయ్, ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ విక్రం కుమార్, కార్మిక శాఖ అదనపు కమిషనర్ ఫిలిప్స్ పాల్గొన్నారు.
చిత్రం... మాట్లాడుతున్న డీజీపీ మహేందర్ రెడ్డి