యువ

కుర్ర‘కారు’కు జై!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్క ఐడియా...జీవితానే్న మార్చేస్తుంది. అదే జరిగింది శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీ కుర్రాళ్ల విషయంలో. ఇటీవలే ముగిసిన ఎలక్ట్రిక్ సోలార్ వెహికిల్ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌లోని శ్రీనిధి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అడ్ టెక్నాలజీకి చెందిన 24మంది విద్యార్థుల బృందం పాల్గొని మూడు బహుమతులు గెలుచుకుంది. ‘టీమ్ మెకనైజర్స్’- ఇది తమ బృందానికి విద్యార్థులు పెట్టుకున్న పేరు.
ఆరు నెలలపాటు శ్రమించి, సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్- సోలార్ కార్‌ను ఈ బృందం డిజైన్ చేసింది. దీనికి ఫస్ట్ రన్నరప్ ప్రైజ్ వచ్చింది. అలాగే బెస్ట్ సోలార్ పెర్ఫార్మర్, లైట్ వెయిట్ అవార్డులనూ గెలుచుకుంది. ‘సోలార్ పేనల్స్ ఆధారంగా ఎక్కువసేపు నడిచే వాహనం తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే డ్రైవర్ సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకున్నాం. పైనున్న సోలార్ పేనల్స్‌ను శక్తిమంతమైన బ్యాటరీతో అనుసంధానించాం. మేం తయారు చేసిన కారు గంటకు 43 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది’ అని వివరించాడు సుజయ్.
అతను టీమ్ మెకనైజర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. సోలార్ ప్యానెల్స్‌పై డస్ట్ పేరుకుపోవడంవల్ల సౌర శక్తిని పూర్తి స్థాయిలో వినియోగించకోలేకపోతున్నట్టు గ్రహించామని, ప్యానెల్స్‌ను నిరంతరం క్లీన్‌గా ఉంచడం వల్ల మరింత సౌరశక్తిని వినియోగించుకునే వెసులుబాటు కలిగిందని సుజయ్ చెప్పాడు. ఈ విజయం తమకెంతో స్ఫూర్తినిచ్చిందని, భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేసి, మరిన్ని విజయాలు అందుకోవాలని ఉందని చెబుతున్న సుజయ్‌కి, అతని బృందానికి ‘యువ’ బెస్ట్ఫా లక్ చెబుతోంది. *

చిత్రం ఎలక్ట్రిక్ సోలార్ కార్‌తో శ్రీనిధి విద్యార్థులు