ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక హోదాపై అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 25: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికైనా స్పందించి ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి ఆపై అఖిలపక్ష బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ కోరారు. ఆ మేరకు ముఖ్యమంత్రికి మంగళవారం రామకృష్ణ లేఖ రాశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని స్పష్టం చేశారన్నారు. వైసీపికి 25 మంది ఎంపీలు ఉంటే ప్రత్యేక హోదా సాధిస్తామని గతంలో జగన్ చాలా సార్లు చెప్పారన్నారు.