జాతీయ వార్తలు

విభజన హామీలు అమలు చేయరేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: ఏపీ విభజన చట్టంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదంటూ కాంగ్రెస్ సభ్యుడు మహమ్మద్ అలీ ఖాన్ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నలతో ముంచెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు, మిషన్ భగీరథకు ఎందుకు నిధులివ్వలేదని ఖాన్ గురువారం లోక్‌సభలో 2019-20 బడ్జెట్‌పై జరిగిన చర్చలో పాల్గొంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన సమయంలో రాజ్యసభలో నిర్ణయించాం.. కానీ సభ ఇచ్చిన హామీని ఇంతవరకు ఎందుకు అమలు కాలేదని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ తిరుపతి బాలాజీ సమక్షంలో ఇచ్చిన హామీని కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమలు చేయకపోవటం సిగ్గుచేటని ఖాన్ చెప్పారు. ‘అందరి వెంటా.. అందరి అభివృద్ధి’ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రధాని మోదీ బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేవని తెలంగాణ కాంగ్రెస్ సభ్యుడు మహమ్మద్ అలీ ఖాన్ విమర్శించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన 2019-20 బడ్జెట్‌లో దేశంలోని బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీల అభివృద్ధికి నిధులు కేటాయించకపోవటం విచిత్రంగా ఉన్నదని అన్నారు. విద్యారంగానికి ఆశించిన నిధులు కేటాయించకపోతే ఎస్‌స్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య ఎలా లభిస్తుందని ఖాన్ ప్రశ్నించారు.