ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ పాలనలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 19: గత ఐదేళ్లలో రాష్ట్రంలో పచ్చచొక్కాల కనుసన్నల్లో యథేచ్ఛగా ఇసుక దోపిడీ జరిగిందని, సామాన్యుడు సొంత ఇంటిని నిర్మించుకోలేని స్థితికెళ్లారని రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శాససనభలో చెప్పారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల్లో అధికారపక్ష సభ్యులు చిర్ల జగ్గిరెడ్డి, నంబూరు శంకరరావు, కె చిట్టిబాబు, జ్యోతుల చంటిబాబులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 153 ఇసుక రీచ్‌లు ఉండగా జూన్ 15వ తేదీ నాటికి అన్ని అనుమతులతో 57 పని చేస్తున్నాయని అన్నారు. అక్రమ త్రవ్వకాలు, అక్రమ రవాణాను నిరోధించడానికి తగిన చర్యలు చేపట్టామన్నారు. సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి నూతన ఇసుక విధానం అమల్లోకి వస్తుందన్నారు.
తిరుమలలోనూ వలంటీర్లను నియమించాలి: భూమా
తిరుమలలో ఐదువేల మంది ప్రజలు నివసిస్తున్నందున వలంటీర్‌లను నియమించాలని జీరో అవర్‌లో తిరుపతి శాసనసభ్యుడు భూమాన కరుణాకరరెడ్డి కోరారు. తిరుమల గ్రామమా, పట్టణమా అనేది తెలియటం లేదన్నారు. ఇక తిరుపతిలో మంచినీటికై మురికివాడల ప్రజలు తల్లడిల్లిపోతున్నారని అన్నారు.