తెలంగాణ

రెండున్నరేళ్లుగా జీతం రాక వీఆర్‌ఎ ఆత్మహత్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ : రెండున్నరేళ్లుగా విధులు నిర్వహిస్తున్నా జీతం ఇవ్వకపోవడంతో కలత చెందిన వీఆర్‌ఏ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని మండలం ఎగ్లాస్‌పూర్ గ్రామానికి చెందిన గువ్వల మహేష్ (36) రెండున్నరేళ్లుగా వీఆర్‌ఏగా విధులు నిర్వహిస్తున్నారు. 2017లో ఉద్యోగం వచ్చిందనే సంబురంతో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో రెండున్నరేళ్లుగా వేతనాలు అందక వెతలు అనుభవిస్తున్నారు. కనీసం ఒక నెల జీతమైనా రావడం లేదని, బతుకు జీవనం గడిచేదెలా అంటూ గత కొన్ని నెలలుగా మదనపడుతూ కనిపించిన వారి వద్దల్లా కన్నీరు పెట్టుకుంటున్నారు. మహేష్ నానమ్మ వీఆర్‌ఏగా గతంలో పనిచేస్తూ మరణించడంతో కారుణ్య నియామకం కింద విఆర్‌ఎ ఉద్యోగం ఇచ్చేందుకు రెవెన్యూ అదికారులు రూ.లక్ష వరకు లంచం తీసుకున్నట్లు మృతుని సోదరుడు వెల్లడించారు. విఆర్‌ఎ ఉద్యోగం ఇచ్చే సమయంలో కూడా రెవెన్యూ అధికారులు నిబంధనల పేర ఇబ్బందులకు గురి చేశారని వెల్లడించారు. ప్రభుత్వ, అధికారుల వైఖరి నిరసిస్తూ తన వీఆర్‌ఏ బలవన్మరణానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ తహశీల్ కార్యాలయం ఎదుట మృతదేహంతో బంధువులతో పాటు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులను పోలీసులు అదుపు చేశారు. అయినా వారు వెనక్కు తగ్గలేదు.

చిత్రం..వీఆర్‌ఏ మహేష్ మృతదేహంతో తహశీల్ కార్యాలయం ఎదుట
ఆందోళన చేస్తున్న బంధువులు, ఉద్యోగులు