అబ్బూరి.. నన్ను నిలబెట్టాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడివి శేష్, రెజీనా, నవీన్‌చంద్ర కీలక పాత్రల్లో వచ్చిన -ఎవరు? థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్నవుతోంది. వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, కెవిన్ అనె్న నిర్మించారు. సినిమా సక్సెస్ సాధించటంతో -యూనిట్ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించింది. దర్శకుడు రామ్‌జీ మాట్లాడుతూ -సినిమాలో డైరెక్టర్ చేసిన తప్పులు కెమెరామెన్, కెమెరామెన్ చేసిన తప్పులు ఎడిటర్, ఎడిటర్ తప్పుల్ని మ్యూజిక్ డైరెక్టర్ సరిచేస్తుంటాడు. సో, నా తప్పుల్ని టెక్నీషియన్లు అంతా కవర్ చేశారు. సినిమా మొదలు పెట్టినప్పుడు అబ్బూరి రవి ఒక మాటన్నారు. నిన్ను నువ్వు నమ్మి చేయి అని. అలాగే నాకు ఇంత మంచి అవకాశాన్నిచ్చిన పివిపికి కృతజ్ఞతలు అన్నాడు. అడివి శేష్ మాట్లాడుతూ -కాలిఫోర్నియా నుంచి వచ్చినా కృష్ణానగర్ కష్టాలు నాకు బాగా తెలుసు. ఒకానొక టైంలో అప్పులిచ్చిన వాళ్లు పోలీసుల్ని కూడా పంపారు. ఢిల్లీలో చుట్టూ లాఠీలు పట్టుకుని డబ్బులు ఎప్పుడు ఇస్తావ్ అని బెదిరించిన రోజులూ ఉన్నాయి. కిస్ చిత్రం తర్వాత పడిన ఇబ్బందులివి. మళ్లీ క్షణం చిత్రంతో కోలుకున్నా. కాని ఎప్పుడు నా వెంట వున్నది మాత్రం అబ్బూరి రవి. ఆయనే నన్ను నిలబెట్టాడు. నేను పెద్ద ఇమేజ్ కోరుకోవడం లేదు. నేను చేస్తున్న సినిమాలు మంచివి అని అంటే చాలు అన్నాడు. సక్సెస్‌మీట్‌లో పలువురు మాట్లాడారు.