తెలంగాణ

టీఆర్‌ఎస్‌ను విమర్శిస్తే ఊరుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ప్రశంసిస్తుంటే, అవినీతి జరిగిందంటూ స్థానిక బీజేపీ నాయకులు విమర్శించడం సరికాదని, తమ పార్టీ పట్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని రాష్ట్ర అబ్కారీ, క్రీడల శాఖ శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. శనివారం మంత్రి హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగంలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతుంటే అవగాహన లోపంతో కుంభకోణాలు జరిగాయంటూ విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పరిశ్రమలు మూతపడే పరిస్థితిలో ఉంటే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక స్వయంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తిని అందించి అనేకమంది ఉద్యోగులను కాపాడుకుంటున్నామని ఆయన తెలిపారు. బీజేపీ నేతలు దేవాలయాలపై రాజకీయాలు చేస్తారని, అలాంటివారు దేశంలో ఒక్క గుడికైనా రూ.100 కోట్లు కేటాయించారా, యాదాద్రి దేవాలయం లాంటి దేవాలయాలు కట్టండి అంటూ మంత్రి సవాల్ విసిరారు. బీజేపీ మాదిరిగా టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది మిస్డ్ కాల్ సభ్యత్వాలు కావని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు తమపై విమర్శలు మాని కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామలు కావాలని ఆయన సూచించారు.