తెలంగాణ

కేంద్రం మెడలు వంచిన సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: సమరశీల సమ్మె పోరాటం ద్వారానే ఆర్టినెన్స్ ఫ్యాక్టరీల కార్పొరేటీకరణపై కేంద్రప్రభుత్వం ఒక అడుగు వెనుక్కు వేసిందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కరాములు, ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబు పేర్కొన్నారు. దేశంలోని 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల కార్పొరేటీకరణ పేరుతో ప్రైవేటీకరించే ప్రయత్నాలను కార్మికులు సంఘటితమై ఉద్యమించడంతో అడ్డుకోగలిగారని అన్నారు. ఈ క్రమంలోనే కేంద్ర రక్షణ ఉత్పత్తుల విభాగం కార్యదర్శి అధ్యక్షతన అఖిల భారత ఫెడరేషన్ల నాయకుల మధ్య చర్చలు జరిగాయని అన్నారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల కార్పోరేటీకరణపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు, దేశవ్యాప్తంగా జరిగిన సమ్మె పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని కార్యదర్శి హామీ ఇవ్వడంతో సమ్మెను వాయిదా వేసుకుంటున్నట్టు ఫెడరేషన్లు ప్రకటించాయని వారు చెప్పారు.