విశాఖపట్నం

మనిషి కాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్ర్తి చొక్కా డబ్బూ దస్కం
డాబూ దర్పం మందీ మార్బలం
ఎనె్నన్నో ఉన్నా స్వార్ధం తలపై
కూర్చున్న వాడికి డబ్బే సర్వస్వం
ధర్మానికి జడవక తెగ దోచుకు తింటూ
తాగి జోగే వాడికి నిరుపేదల బాధ వేదన రోదన
వినబడని పాట ఎవరికీ ఎన్నడూ సహాయ మందించక
సమాజ వృక్షాన్నుండి తెగిపడ్డ కొమ్మావాడు
చిగురించడు అతకడు చేతుల్లోని కుర్చీలో
చేతలుడిగిన వాడు మరుగుజ్జు మేరు పర్వతం!
నిజానికి అతడు మనిషి కానే కాడు!

- యల్. రాజాగణేష్,
పాతగాజువాక, విశాఖపట్నం. సెల్ : 9247483700.
--

ప్రేయసి

అక్కడెక్కడో పూసుకున్న పరిమళం
నా గుండెల్లో ప్రవహించింది
ఆనాటి నా జ్ఞాపకాలు
ఈరోజుకీ తాజాగా ఉన్నాయి
రోజులు, నెలలు మారినా
అప్పటి మన మాటలు
నీతో ఉండే క్షణాలు, నీవు లేకుండా ఉండే సమయాలు
ఇప్పటికీ తాజాగానే ఉన్నాయి
అప్పుడు మనం గడిపిన సాక్ష్యాలు
ఇప్పటికీ కన్నీటి బిందువులు
అడుగడుగునా గుండెల్ని కాలుస్తున్నాయి
నీవు నా ప్రేయసి కాదు
నిరంతరం నన్ను కాటేసే
జ్ఞాపక పరిమళానివి!

- కె. సతీష్,
శ్రీకాకుళం.
సెల్ : 7675924944.

---

జై జవాన్

ఎలా మరువను
నీ సాహసోపేత చర్యలు
నీ త్యాగపు మహిమలు
ఎలా తీర్చుకోవాలి నీ రుణం
ఓ వీరజవాను
ఓ ధీర జవాను
మంచు పర్వతాల నడుమ
కంటికి కునుకు లేకుండా
శత్రుదాడుల మధ్య నలిగి
దేశమాత రక్షణలో
అశువులు బాసిన సాహసి
ఎలా మరువను?
అర్ధరాత్రి చీకట్లలో
ఫిరంగుల మోతలతో
తూటాల వర్షాలతో
చూపులన్నీ నెత్తుటేరులై
గుండె నిండగా సాహసాలై
ప్రతిధ్వనించే యుద్ధసేనాని!

- విద్వాన్ ఆండ్రకవిమూర్తి,
అనకాపల్లి.
సెల్ : 9246666585.

---
తల్లిదండ్రులు

తల్లిదండ్రులుంటే ప్రేమతో పెంపకం
తోబుట్టువులుంటే సరదా సందడి
సరియైన జోడీ దొరికితే సాఫీ జీవనం
సంతానం కలిగితే బాధ్యత మమకారం
పెరటి సాగుంటే ఇంట్లోనే ఫలసాయం
సద్గురువులుంటే చదువు జ్ఞానం
స్నేహం ఉంటే అందరితో సహవాసం
మంచిగ ఉంటే మర్యాదా మన్ననా
అహంకరిస్తే మిగిలేది అవమానం శత్రువులు
వినయ విధేయతలుంటే అంతా మనశ్శాంతే
ఆరోగ్యం ఉంటే అదే పెద్ద సంపద
తెలివి ఉంటే అదే బ్రతుకు తెరువు
సుఖశాంతులతో జీవించుటకు తృప్తి చాలు
జీవితం విలువ తెలియుటకు దైవం తోడు
తల్లిదండ్రులు జన్మకు ఇలలో కారణం
అందరిలో ఉన్న పరమాత్మకు ఆత్మనివాళి!

- శ్రీమతి గంటి కృష్ణకుమారి,
బాబామెట్ట, విజయనగరం.
సెల్ : 9441567395,

---

ఖాతా

ఖాతా నెంబరు చెప్పేవా
ఖతం అయిపోతావు కన్నా
ఖతర్‌నాక్‌లు ఎందరో
కలిలో ఉన్నారు దండిగా
గాలానికి ఎరగా
వానపాముని కట్టి
ఎగరేస్తారు నీ
సొమ్ము చాపలన్నిటినీ

- శ్రీమాన్ శ్రీకాశ్యప,
సింహాచలం.
సెల్ : 9985520479.