జాతీయ వార్తలు

నిబంధనలు ‘గాలి’కొదిలేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: కాలుష్య నివారణకు యూపీ, హర్యానా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాతావరణ కాలుష్య నివారణ బోర్డు వెల్లడించింది. రెండు రాష్ట్రాల్లో పరిశ్రమలు విచ్చల విడిగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నా అధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఎన్విరాన్‌మెంట్ పొల్యూషన్ అథారిటీ(ఈపీసీఏ) చైర్మన్ భురేలాల్ తప్పుపట్టారు. వాయు కాలుష్య నిరోధానికి ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదని ఆయన విమర్శించారు. నిబంధనలు పట్టించుకోవడమే లేదని ఆయన ఆగ్రహించారు. వాయుకాలుష్యంపై ముఖ్యంగా రానున్న శీతాకాలంలో తీసుకోవల్సిన చర్యలపై గురువారం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘యూపీ, హర్యానా ప్రభుత్వాలు పారిశ్రామిక కాలుష్యం నివారణకు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని వెల్లడైంది. దీనికి సంబంధించి చాయాచిత్రాలు సేకరించాం’అని భూరేలాల్ వెల్లడించారు. వైఖరి మార్చుకోవాలని రెండు రాష్ట్రాలను హెచ్చరించినట్టు ఆయన తెలిపారు. అయినా పరిస్థితిలో మార్పులేకపోతే స్వయంగా తానే ఆ రాష్ట్రాల్లో పర్యటిస్తానని చైర్మన్ స్పష్టం చేశారు. కాలుష్య నివారణలో ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈపీసీఏ చైర్మన్ మెచ్చుకున్నారు. సుమారు 85,000 టన్నుల ప్లాస్టిక్, రబ్బర్ వ్యర్థాలను రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ ద్వారా తరలించారని భూరేలాల్ పేర్కొన్నారు. బవానా, నరేలా, ముంధాక, టిక్రీ, నాన్‌గ్లొయి నుంచి ఢిల్లీ జల మండలి, ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ల సహకారంతో వ్యర్థాలు తరలించారని ఆయన అన్నారు. ఢిల్లీ రాష్ట్రంలో చెత్త, ప్లాస్టిక్, రబ్బర్ వ్యర్థాల దహనం సంఘటనలు బాగా తగ్గాయని ఆయన వెల్లడించారు. ఉత్తరప్రదేశ్, హర్యానాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమల నుంచి అడ్డూఅదుపూలేకుండా కాలుష్యం వస్తోందని, అధికారులు నివారణ అలాగే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న దాఖలాలే లేవని అథారిటీ చైర్మన్ విమర్శించారు. అలాగే పారిశ్రామిక వ్యర్థాలు ఎక్కడ బడితే అక్కడ తగలబెడుతున్నారని, వాటికి సంబంధించిన చిత్రాలు చూశామని భూరేలాల్ చెప్పారు. త్వరలోనే హర్యానా అధికారులతో ఈపీసీఏ సమావేశమవుతుందని ఆయన వెల్లడించారు. అలాగే ఈనెల 27 ఢిల్లీలోమరో సమావేశం ఉంటుందని ఆయన వివరించారు. రాజస్థాన్‌లోని భివాడీ ప్రాంతాన్ని త్వరలో సందర్శిస్తామని ఆయన తెలిపారు. చెత్త, ప్లాస్టిక్, రబ్బరు దరహనం అలాగే భవన నిర్మాణ వ్యర్థాల డంపింగ్, దూళిని నిర్మూలించేందుకు అవసరమైన సూచనలు, సలహాలు అథారిటీ ఇస్తోందని ఆయన అన్నారు. రోడ్లను ఊడ్చేందుకు యంత్రాల వాడకం, ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడం ద్వారా వాయు కాలుష్యాన్ని నివారించవచ్చని ఆయన స్పష్టం చేశారు.