ఆంధ్రప్రదేశ్‌

ఖనిజాభివృద్ధి సంస్థ ఎక్స్‌అఫీషియో ఈడీగా జేసీ-1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 9: రాష్ట్రంలో కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇసుక తవ్వకాలు, రవాణా వ్యవస్థను పర్యవేక్షించేందుకు వీలుగా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఎక్స్‌అఫీషియో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా జాయింట్ కలెక్టర్-1ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక విధానం అమల్లోకి వచ్చిన తరువాత భవన నిర్మాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇసుక రీచ్‌లు, స్టాక్ యార్డుల నిర్వహణకు అదనపు సిబ్బందిని కేటాయించాలని ప్రభుత్వాన్ని ఖనిజావృద్ధి సంస్థ కోరింది. అదనపు సిబ్బంది మంజూరు అంశంపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ముందుగా ఆయా జిల్లాల జేసీ-1లను ఎక్స్‌అఫీషియో ఈడీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ జిల్లాల్లోని గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు ఇసుకకు సంబంధించిన వివిధ అంశాలను జేసీ-1 దృష్టికి తీసుకురావాలని ఆదేశించింది. ఇసుక విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసినందుకు 8000 రూపాయల గౌరవ వేతనాన్ని చెల్లించనుంది.
రూ. 259 కోట్ల పంచాయతీరాజ్ రహదారి పనులు రద్దు
మంజూరైనప్పటికీ, ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి ప్రారంభించని పనులను రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాజాగా మరో 3971 పంచాయతీరాజ్ రహదారి పనులను రద్దు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనుల విలువ 258.93 కోట్ల రూపాయలు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ గ్రాంట్ కింద ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తూ చేపట్టేందుకు ప్రతిపాదించిన ఈ పనులు ప్రారంభం కాకపోవడంతో రద్దు చేసింది. గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువ పనులు రద్దు అయ్యాయి.
జలవనరుల శాఖ రిహేబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్ కమిషనర్‌కు సలహదారుగా ఎస్‌వీ వర్సిటీకి చెందిన విశ్రాంత ఎస్‌ఈ ఎన్ గోవింద రెడ్డిని నియమించింది. రాష్ట్రంలో పనులు జరుగుతున్న వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి సాంకేతిక సలహాలను అందచేస్తారు. ఆ పదవిలో సంవత్సరం పాటు కొనసాగుతారు.
ఆరోగ్య సమాచార వ్యవస్థ ఏర్పాటుకు టాస్క్ఫోర్స్
హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం అమలుకు సమగ్ర కార్యాచరణ రూపకల్పనకు వీలుగా టాస్క్ ఫోర్సు కమిటీని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఏర్పాటు చేసింది. ఐటీ అధారిత సేవల ద్వారా ప్రజలకు ఆరోగ్య సమాచారాన్ని అందచేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే అమల్లో ఉన్న హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టంను అధ్యయనం చేసి సమగ్ర విధానాన్ని సిఫారసు చేసేందుకు వీలుగా టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేసింది. సభ్యులుగా ఐటీ సలహాదార్లు శ్రీనాధ్ దేవిరెడ్డి, జె.విద్యాసాగర్, ఎమ్మెల్యే కె.శ్రీనివాసరావు, ఈ-ప్రగతి ప్రతినిధి బాలసుబ్రహ్మణ్యం, ఐటి శాఖ ప్రతినిధి వై.విశ్వనాథ్, ప్రజారోగ్య డైరెక్టర్ అరుణ కుమారి, ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ పి.దుర్గా ప్రసాద్, వైద్య విద్య డైరెక్టర్ ఎం.వెంకటేష్, ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ వి.విజయరామారాజు, మెంబర్ కన్వీనర్‌గా ఆరోగ్య శాఖ డైరెక్టర్ కార్తికేయ మిశ్ర వ్యవహరిస్తారు. ప్రజల వైద్య రికార్డుల నిర్వహణ, పరికరాల నిర్వహణ, మానవ వనరుల మ్యాపింగ్ తదితర అంశాలపై సమగ్ర వ్యవస్థ ఏర్పాటుకు అవసమైన సిఫారసులను చేయాల్సి ఉంటుంది. కమిటీ తొలి సమావేశమైన నాటి నుంచి నాలుగు వారాల్లో నివేదిక అందించాల్సి ఉంటుంది.
పరికరాల కొనుగోలుకు నిపుణుల కమిటీ
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సమగ్ర వ్యవసాయ ప్రయోగాశాలల ఏర్పాటుకు అవసరమైన యంత్రపరికరాలను కొనుగోలు చేసేందుకు 9 మందితో సాంకేతిక నిపుణుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నియమించింది. వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హెచ్ అరుణకుమార్ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో సభ్యులుగా వ్యవసాయ శాఖ అధికారిణి వై.లక్ష్మీశ్వరి, రంగా వ్యవసాయ వర్సిటీ రీసెర్చి విభాగ డైరెక్టర్ ఎ.ఎస్.రావు, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ సీవీ రావు సహా మరో ఐదుగురిని నియమించింది. ప్రయోగశాలకు కావాల్సిన యంత్ర పరికారాల గుర్తింపు, టెండర్ల ఖరారీ, కొనుగోలు, ఆయా ప్రయోగశాలల్లో ఏర్పాటు తదితర వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది.
ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యుల ఎంపికకు సెర్చి కమిటీ
ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యులను ఎంపిక చేసేందుకు వీలుగా నలుగురు సభ్యులతో ఒక సెర్చి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. చీఫ్ సెక్రటరీ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో సభ్యులుగా సీసీఎంబీ మాజీ డైరెక్టర్ సిహెచ్ మోహన రావు, తిరుపతి ఐఐటి డైరెక్టర్ కె.ఎన్ సత్యనారాయణ, ఆర్జీయుకేటీ చాన్సలర్ కె.సి.రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ పి.జయప్రకాష్‌రావులను నియమించింది.