క్రీడాభూమి

క్లీన్‌స్వీప్‌కు రెండు వికెట్లే అడ్డు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత బౌలర్లు రెచ్చిపోయారు. పేస్, స్పిన్ బౌలింగ్‌తో సఫారీలను ఓ ఆట ఆడుకున్నారు. చేసేదిలేక దక్షి ణాఫ్రికా బ్యాట్స్‌మెన్లు ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు క్యూ కట్టారు. మూడో రోజు సోమవారం ఓవర్ నైట్ స్కోర్ 9/2తో మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణా ఫ్రికా ఆదిలోనే కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ (1) వికెట్‌ను కోల్పోయంది. ఉమేశ్ యాదవ్ వేసిన అద్భుత బంతిని అంచనా వేయలేకపోయన డుప్లెసిస్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత బావుమాతో జతకట్టిన జుబేర్ హమ్జా నిదానంగా ఆడుతూ స్కోరు బోర్డును పెంచే బాధ్యతను తీసుకున్నాడు. వీరిద్దరూ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ నిలకడగా ఆడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో హమ్జా అర్ధ సెంచరీని పూర్తిచేసుకున్నా డు. మరోవైపు బావుమా కూడా అందివచ్చిన బంతులను బౌండరీలకు బాదడం మొదలు పెట్టాడు. అయతే కొద్దిసేపటికే అర్ధ సెంచరీ సాధించిన హమ్జా (62) రవీంద్ర జడేజా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో 107 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా జట్టు నాలుగో వికెట్‌ను కోల్పోయంది. హమ్జా, బావుమా కలిసి 91 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జట్టుకు అందించారు. ఇక ఆ తర్వాతి ఓవర్లోనే బావుమా (32) నదీమ్ బౌలింగ్‌లో స్టాంపౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వరుసగా హెన్రిచ్ క్లాసెన్ (6), డేన్ పిడ్త్ (4), కగిసో రబద (0), అన్రిచ్ నార్జే (4), లుంగీ ఎంగిడి (0, నాటౌట్) అవుటవడంతో మొదటి ఇన్నింగ్స్‌లో సఫారీలు 162 పరుగులకే చాప చుట్టేశారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3వికెట్లు తీయగా, మహ్మద్ షమీ, షబాబ్ నదీమ్, రవీంద్ర జడేజా, తలా రెండేసి వికెట్లను తీశారు. అప్పటికే మొదటి ఇన్నింగ్స్‌లో 335 పరుగుల ఆధిక్యతను భారత్ సంపాదించింది. దీంతో దక్షిణాఫ్రికా వెంటనే ఫాలో ఆన్ ఆడించింది. అయతే రెండో ఇన్నింగ్స్‌ను దిగిన సఫారీలు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ఉమేష్ యాదవ్ వేసిన రెండో ఓవర్లో ఓపెనర్ క్వింటన్ డికాక్ (5) పరుగుల వద్ద బౌల్డయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్ డీన్ ఎల్గర్ ఉమేశ్ యాదవ్ వేసిన బౌన్సర్‌కు గాయపడడంతో రిటైర్డ్‌హార్ట్‌గా మైదానం వీడాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న హమ్జా (0) రెండో ఇన్నింగ్‌లో పరుగులేమీ చేయకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక్కడి నుంచి దక్షిణాఫ్రికా వికెట్ల పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ (4), టెంబ బావుమా (0), హెన్రిచ్ క్లాసెన్ (5), జార్జ్ లిండే (27), డీన్ పెడ్త్ (23), కగిసో రబద (12) ఇలా వచ్చి అలా వెళ్లడంతో దక్షిణాఫ్రికా 121 పరుగులకే 8 వికెట్లు కోల్పోయ పీకల్లోతు కష్టాల్లో మునిగింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లను కోల్పోయ 132 పరుగులు చేసింది. క్రీజులో థీనస్ డీబ్రూయన్ (30, నాటౌట్), అన్రిచ్ నార్జే (5, నాటౌట్) ఉన్నారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లను పడగొట్టగా, ఉమేష్ యాదవ్ 2, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ తీశారు. మ్యాచ్ ముగిసేందుకు రెండు రోజుల సమయం ఉండడంతో భారత్ విజయం ఖాయమైంది.