జాతీయ వార్తలు

ఆ విమర్శలు అర్థరహితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: చంద్రయాన్ మిషన్‌లో సాంకేతికంగా కొన్ని సమస్యలు తలెత్తినంత మాత్రాన అది విఫలమైందని చెప్పడం అర్థరహితమని కేంద్రం స్పష్టం చేసింది. అవగాహనా రాహిత్యంతోనే అలాంటి విమర్శలు చేస్తున్నారే తప్ప చంద్రయాన్ విషన్ విజయవంతమైందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. భారత కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటిచెప్పిన చంద్రయాన్ మిషన్‌పై గురువారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. మిషన్ మొత్తం విజయవంతమైందన్న మంత్రి లాండింగ్ దగ్గరే సాంకేతికపరమైన సమస్యల తలెత్తిందని మంత్రి చెప్పారు. రాజ్యసభ ప్రశ్నోత్తర కార్యక్రమంలో అనుబంధం ప్రశ్నకు మంత్రి బదులిస్తూ ‘అంతరిక్ష పరిశోధనల్లో ఆరితేరిన ఏడు దేశాలూ ఒకేసారి ఆ స్థాయికి చేరుకోలేదు. అమెరికా సహా ఆ దేశాలు తొలుత విఫలమైనవేనని జితేందర్ సింగ్ స్పష్టం చేశారు. ‘చంద్రయాన్ మిషన్‌ను యావత్ భారతీయులు ఆస్వాదించారు. మిషన్ అన్ని విభాగాలను అధిగమిస్తూ చివరి వరకూ సాగింది. ఆఖర్న సాంకేతిక సమస్య తలెత్తడంతో విక్రం చంద్రుడిపై కాలుమోపలేకపోయింది’అని మంత్రి వివరించారు. సాంకేతికంగా చూస్తే చంద్రయాన్ విజయం సాధించిందన్న మంత్రి ఏవో సమస్యలు ఉత్పన్నమైనంత మాత్రాన విఫలమైందని చెప్పడం సరైంది కాదని ఆయన అన్నారు. ‘చంద్రయాన్ మిషన్ ప్రయాణం సవ్యంగానే మొదలైంది. భూమి నుంచి ఆర్బిట్ చక్కగా వెళ్లింది. లూనార్ ఆర్బిట్ ప్రవేశం కూడా విజయవంతమైంది. అర్బిటర్ పనితీరు సంతృప్తికరంగానే సాగింది. ఆఖరున లాండింగ్ సమసయంలో నిరాశపరిచింది’అని ఆయన చెప్పారు. 30 కిలోమీటర్లు మిగిలి ఉండగా సమస్య తలెత్తిందన్న జితేందర్ సింగ్ ‘దాన్ని విఫలమైందని నేను భావించడం లేదు’అని మంత్రి స్పష్టం చేశారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయనీ సందర్భంగా గుర్తుచేశారు. ‘శాస్తవ్రేత్తల కృషి అమోఘం. చంద్రయాన్ మిషన్ విజయవంతమైంది’అని ప్రధాని మోదీ ప్రకటించారు. ఒక్క ప్రయత్నంలోనే లాండింగ్ అయిన సందర్భాలు ఎక్కడా లేవని రాజ్యసభకు ఆయన తెలిపారు. ఏ దేశం కూడా మొదటి ప్రయత్నంలోనే లక్ష్యాన్ని చేధించలేదని జితేందర్ సింగ్ అన్నారు.‘ అమెరికా అంతరిక్ష ప్రయాణం మనకంటే ముందే ఎప్పుడో మొదలెట్టింది. అమెరికా ఎనిమిది సార్లు విఫలయత్నం చేసిన తరువాత సజావుగా లాండింగ్ జరిగింది’అని ఆయన వెల్లడించారు. ‘మనం చందమామ పాట పాడుకుంటున్నప్పుడే అమెరికా తన ప్రయత్నాలు మొదలెట్టిందన్న సంగతి మరచిపోకూడదు. మిగతా దేశాల అనుభవాలను అధ్యయనం చేసి ముందుకు సాగుతున్నాం’అని ఆయన పేర్కొన్నారు. 500 మీటర్ల దూరంలో ఉండగా లాండింగ్ సమస్య తలెత్తిందిన ఆస్రో చైర్మన్ శివన్ ప్రకటించిన విషయాన్ని ఆయన సభకు తెలిపారు.

*చిత్రం... కేంద్ర మంత్రి జితేందర్ సింగ్