జాతీయ వార్తలు

మహిళల భద్రతకు 112 యాప్ పటిష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: మహిళల భద్రతకు సంబంధించిన 112 యాప్‌ను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ. కిషన్‌రెడ్డి తెలిపారు. లోక్‌సభలో మంగళవారం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఎన్‌సీపీ సభ్యురాలు సుప్రియా సూలే అడిగిన ప్రశ్నకు కిషన్ రెడ్డి సమాధానమిస్తూ మహిళలు, విద్యార్థినులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని విజప్తి చేశారు. ఈయాప్‌లో ప్రమాదం గురించి రిజిస్టర చేసిన వెంటనే సమీప పోలీసులు స్పందించే విషయం వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని కిషన్‌రెడ్డి చెప్పారు. 112 యాప్‌లో పరిస్థితిని రిజిస్టర చేయగానే దీనికి సంబంధించిన సమాచారం స్థానిక పోలీసు స్టేషన్‌తోపాటు ఎసీపీ, డీసీపీకి కూడా వెళ్తుందని ఆయన తెలిపారు. 112 యాప్‌ను వలంటీర్లు కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలని కిషన్‌రెడ్డి విజప్తి చేశారు. ప్రమాదంలో ఉన్న మహిళల 112 యాప్‌లో మీట నొక్కగానే ప్రమాద సంకేతం పోలీసులతోపాటు వలంటీర్లకు కూడా వెళ్తుంది. ప్రమాదంలో ఉంటే మహిళలు ఉన్న ప్రాంతంలో ఉండే వలంటీర్లకు కూడా ప్రమాద సంకేతం అంది వారు కూడా వెంటనే స్పందించేందుకు యాప్‌లో ఏర్పాటు చేసినట్లు కిషన్ రెడ్డి వివరించారు.

*చిత్రం...కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ. కిషన్‌రెడ్డి