Others

భక్తి, రక్తి, ముక్తినిచ్చే పర్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించే పుణ్య ఘడియలివి. ఈరోజునుండి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం. దేవ మార్గం ప్రారంభమయ్యే రోజు. ప్రతినెలా సంక్రాంతి పురుషునకు ఒక్కొక్క రూపం, ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఈ మకర సంక్రమణం అత్యంత ముఖ్యమైనది. ఈ సంక్రాంతివేళ స్నాన- దాన- జప- వ్రతాదులు విశేష ఫలాన్నిస్తాయి. రాత్రి పూర్వభాగమున గాని- నిశీధమున గాని సంక్రాంతి అయినట్లయితే ఉత్తర దినము పుణ్యకాలము. అందులోనూ మధ్యాహ్నంలోగానే పుణ్యకాలము. ‘‘సంక్రాంతి రేగ్రహణాదికా’’ అను శ్లోకము ననుసరించి శుక్ల సప్తమినాడు సంక్రాంతి అయినచో గ్రహణంనాటి కంటే ఎక్కువని భావన. ఉత్తరాయణ పుణ్య కాలానికి ఆరంభము కావున ఈ కాలంలో ధాన్యం- ఫలాలు- విసనకఱ్ఱ- వస్త్రం- సువర్ణం కాయగూరలు- దుంపలు- తిలలు- చెఱకు- గోవు మొదలైనవి దానం చేయాలని శాస్త్ర వచనం. ఈ రోజున వస్తద్రానం చేయడం ఉత్తమ ఫలితాన్నిస్తుంది. పంచ రుణాలనుంచి గృహస్థులు విముక్తి పొందే మార్గాలను ఆచారాల రూపంలో నిక్షేపించి- నిర్దేశించిది ఈ మకర సంక్రాంతి. సంక్రాంతినాడు శివుని ప్రతిమకు నేతిలో అభిషేకం చేసి, నువ్వు పువ్వులతోనూ, మారేడు దళములతోను పూజించాలి. ధూపదీప నైవేద్యములు సమర్పించి, ప్రార్థన చేసి, ప్రదక్షిణ చేసిన విశేషఫలం కల్గుతుంది. రాత్రివేళ జాగరణ చేయాలి. ఈ కార్యమును దధిమంధన వ్రతం అంటారు. జాబాలి, ఋషినాగుడనేమునికి ఈ వ్రతమును తెలిపినాడు. ఓం నమఃశివాయ మంత్రజపం చేయడం ముఖ్యం. అందువలన శివసాయుజ్యం లభిస్తుంది. దారిద్య్రం పోతుంది. దధిమంధన దానానికి అఖండ సుఖ భోగాలు లభిస్తాయి. ధాన్యమూ, సంతతీ కల్గుతాయి.
యశోదా కృష్ణుల ప్రతిమకు యథావిధి పూజ చేసి పెరుగు చిలకడానికి కావలసిన సామగ్రిని, ఆ ప్రతిమలనూ సత్పాత్రునికి దానం చేయాలి.
స్ర్తిలు సావిత్రి గౌరీవ్రతం చేస్తారు. సంక్రాంతి నాడు నువ్వులు బియ్యం కలిపి శివుణ్ణి అభి షేకిస్తారు. సంక్రాంతి రోజున శివునికి నువ్వుల నూనెతో దీపం పెడితే శని దోషాలు తొలగిపోతాయని పురాణవచనం. స్ర్తిలందరూ పండు తాం బూలాలను పంచుకుని సంతోషంగా సంక్రాంతిని సంభావిస్తే తనతో పాటు వ్యవసాయం చేయడం లో తమకు తోడ్పాటు అందించిన కర్మచారులైన కమ్మరి, కుమ్మరి, నేతన్న, వడ్రంగి, మొదలైన వారిని, జానపద కళాకారులైన బుడుబుక్కలవాళ్ల పాటలు, దాసరుల వైష్ణవ సంకీర్తనలు, జంగందేవర శైవనామాలు, గంగిరెద్దుల వాళ్ల ఆట పాటలు, సన్నాయి మేళాలు వాయంచేవారిని - ఇలాంటి వారినందరిని పిలిచి వారు పంచే జానపద సంపదను అందుకుంటూ తాను పండించిన పంట లో కొంతవారికిచ్చి వారిని గౌరవిస్తున్నారు. పిల్లలందరూ గాలిపటాలను ఎగురవేసి సంక్రాంతి పండుగను సంబరంగా జరుపుకుంటారు.
‘‘కళకళలాడే సంక్రాంతి, కాసులు చూసే సంక్రాంతి’’గా భావించి సంతోషంతో రైతులు తమవారందరికీ బహుమానాలిస్తారు. పనివారికి ధ్యానం పంచుతారు.కొత్తబట్టలు ఇస్తారు. కొత్త్ధాన్యంతో అరిసెలు, పొంగలి, పులగం మొదలైన పిండివంటలు వండి పదిమందితోకలిసి పంచుకుని తిని ఆనందిస్తారు
కొందరు సంక్రాంతి నాడు రాముని పూజ చేస్తారు. రామునిలాగా ధర్మమార్గంలో నడవడానికి శక్తి కలగాలని రామాయణాన్నీ పఠిస్తారు. బలిచక్రవర్తికి ఉన్న త్యాగ గుణం అలవడాలన్న కోరికతో వామన పురాణాన్ని కూడా వింటారు. ముంబై ప్రాంతంవారు నువ్వులపిండిని ఉపయో గిస్తూ స్నానాదులు ఆచరిస్తారు. తెలుగునాట అంతా నువ్వుల ఉండలను చేసి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు.
ఈరోజున కుడిచేతిని చిన్ముద్రగా చేసుకుని శబరిమలైమీద వెలిసిన హరిహర పుత్రుడు స్వామి అయ్యప్ప జ్యోతిరూప దర్శనం కోసం లక్షలాది మంది ఎదురు చూస్తుం టారు. దీక్షా ధారణ చేసిన అయ్యప్పలందరూ శబరి మలై చేరి మకర విళక్కు (మకర పూజ)ను నిర్వర్తించి మకరజ్యోతి దర్శనం చేసుకోవడం సంక్రాంతి పండుగ ప్రత్యేకతల్లో ఒకటి.
శివగంగ అనే కొండపై ఉన్న ఏకశిలపై మకర సంక్రాంతినాడే నీరు ఊరుతుంది. మామూలు రోజుల్లో అక్కడెక్కడా నీళ్లుండవు. ఈ సంక్రాంతినాడే నలభై ఔన్సుల నీరు ఊరుతుంది. ఈ శివగంగ కొండ పూనా బెంగుళూరు రైలు లైనుకు రెండుమైళ్లదూరం ఉంటుంది. తూర్పునుంచి నంది లాగా, పడమటి నుంచి విఘ్నే శ్వరునిలా, ఉత్తరాన్నుంచి పెద్ద పాములాగా, దక్షిణాన్నుంచి లింగాకారంలో కనిపిస్తుంటుంది.
సంక్రాంతి పక్కరోజు కనుమ పండుగ. పశుగణాన్ని పూజించే రోజు. ఈరోజన రైతన్నలకు వ్యవసాయపనుల్లో సాయపడిన పశువులకు కొత్తపంటతో వండిన పొంగళ్లనుపెట్టి కొమ్ములకు రంగులు పూసి ఉత్సవాలు చేస్తారు.
సాయంత్రంవేళ ఎడ్లబండ్లకు కట్టి ఊరు ఊరంతా తిప్పుతారు. దీన్ని బండ్లు తిప్పటం, పండుగ అని కూడా అంటారు. జాజు, సున్నం పట్టీల అలంకరణతో ఈ బండ్లు ఎంతో కన్నుల పండువుగా ఊరేగింపులో ఉంటాయి.

- చరణ శ్రీ