ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

రాజ్యాంగాన్ని భ్రష్టుపట్టించిందెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు రోజుల క్రితం 71వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాము. భారత రాజ్యాంగానికి మనం ఇచ్చే ప్రాధాన్యతకు గణతంత్ర దినం నిదర్శనంగా ఉంటోంది. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాల ఫలితంగా రాజ్యాంగం భ్రష్టుపడుతోందంటూ కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు, కుహనా లౌకికవాదులు పదే పదే ఆరోపిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టంతో పాటు ఎన్.పి. ఆర్.ఎన్.ఆర్.సిని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, ఎంఐఎం తదితర పార్టీలు రాజ్యాంగంలోని ప్రియాంబుల్ (ముందుమాట)ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా చదివి తమ నిరసన వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో పాఠశాల విద్యార్థుల చేత ప్రతిరోజూ ‘ప్రియాంబుల్’ను విధిగా చదివించాలని అక్కడి పాలకులు నిర్ణయం తీసుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగం నిర్దేశించిన లౌకిక వాదాన్ని ప్రధాని మోదీ దెబ్బ తీసి, దేశాన్ని సంక్షోభంలో పడవేశారంటూ కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు. రాజ్యాంగంలోని ప్రియాంబుల్‌కు కాంగ్రెస్ వారు ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు? ప్రియాంబుల్‌లో లౌకిక, సమసమాజం అనే పదాలను రాజ్యాంగ నిర్మాతలు పొందుపరిచారా? లేక మధ్యలో వచ్చాయా? అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉంది.
వాస్తవానికి బీఆర్ అంబేద్కర్ తదితర మేధావులు రూపొందించిన రాజ్యాంగంలో లౌకికవాదం, సోషలిజం అనే పదాలు లేవు. వీటిని 1976లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఎమర్జెనీలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచారు. రాజ్యాంగంలోని పలు ఇతర ఆర్టికల్స్‌ను కూడా ఆమె హయాంలో సవరించారు. 42వ సవరణను ‘మినీ రాజ్యాంగం’ అని కూడా పిలుస్తారనేది కొందరికి మాత్రమే తెలుసు. ప్రియాంబుల్‌ను సవరించటంతోపాటు పలు ఆర్టికల్స్‌ను మార్చటం ద్వారా రాజ్యాంగాన్ని ఇందిరమ్మ ఆనాడే భ్రష్టుపట్టించారు. రాజ్యాంగం రూపురేఖలను మార్చి, సుప్రీం కోర్టు అధికారాలను సైతం కత్తిరించటంతోపాటు రాష్ట్రాల హక్కులు, అధికారాలను హరించి పార్లమెంటుకు, ప్రధాన మంత్రికి తిరుగులేని అధికారాలను కట్టబెట్టన ఘనత ఇందిరకు దక్కింది. ఇందిరమ్మ వారసులతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఇపుడు మోదీ రాజ్యాంగాన్ని భ్రష్టుపట్టించారని ఆరోపించటం అర్థరహితం కాదా? ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా పౌరసత్వ సవరణ చట్టం ద్వారా లౌకికవాదానికి, సో షలిజానికి భిన్నంగా పని చేస్తున్నారని కాంగ్రెస్ వా రు ప్రచారం చేయటం తప్పుకాదా?
అంబేద్కర్ తదితర మేధావులు రూపొందించి న రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావన లేని లౌకికవాదం, సోషలిజం అనే పదాలను ఎమర్జెన్సీ రోజుల్లో చొప్పించటం నేరం కాదా? లౌకికవాదం అనే పదాన్ని రాజ్యాంగంలో పొందుపరచటంపై రాజ్యాంగ నిర్మాతలు లోతుగా చర్చించి ఈ పదాన్ని పొందుపరచి భావితరాలను కట్టివేయటం మంచిది కాదనే నిర్ణయానికి వచ్చారు. అందుకే వారు 1950లో అమలులోకి తెచ్చిన రాజ్యాంగంలో లౌకికవాదం, సోషలిజం అనే పదాలు లేవు. మతపరమైన హింస మూలంగా మూడు ఇస్లామిక్ దేశాల నుండి శరణార్థులుగా వచ్చిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్శీలకు మతం ఆధారంగా పౌరసత్వం కల్పించటం ద్వారా మోదీ రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారంటూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు, కుహనా లౌకికవాదులు చేస్తున్న ఆరోపణలు నిజం కావు. రాజ్యాంగంలోని ప్రియాంబుల్‌లో ‘్భరత ప్రజలమైన మేము ఈ భారత దేశాన్ని సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందించుకుని భారత పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచనలోనూ, భావ ప్రకటనలోనూ , మత విశ్వాసంలోనూ, ఆరాధనలోనూ స్వేచ్చను, జీవిత అవకాశాలలో, సామాజిక విషయాలలోనూ సమానత్వాన్ని కల్పించి వ్యక్తి గౌరవాన్ని, జాతీయ ఐక్యతను పెంపొందించుకోవడానే విధంగా సౌభ్రాతృత్వాన్ని కల్పించి ఈ రాజ్యాంగ పరిషత్తులో చర్చించి, తీర్మాణించి, పరిగ్రహించి చట్టరూపంలో మాకు మేము 26 నవంబర్ 1949 నాడు సమర్పించుకున్నాము’ అని మాత్రమే ఉన్నది.
జవహర్‌లాల్ నెహ్రూ రాజ్యాంగ లక్ష్యాలను తయారు చేసి 1946 డిసెంబర్ 13న కాన్‌స్టిట్యుయెంట్ అసెంబ్లీలో ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదించిన లక్ష్యాల ఆధారంగానే ప్రియాంబుల్ రూపొందింది. ఆ ప్రియాంబుల్‌ను అంబేద్కర్ ఘనంగా పొగిడారు. ఆ ప్రియాంబుల్‌లో ఎక్కడా లౌకికవాదం అనే పదం లేదు. దానిని నె హ్రూ కుమార్తె ఇందిర సవరించారు. మోదీ ప్రభుత్వం నేడు తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం మూలంగా రాజ్యాంగం కల్పించిన లౌకికవాద హక్కుకు భం గం కలుగుతోందంటూ కుహనా లౌకిక వాదులు చేస్తున్న వాదనకు ఇందిరమ్మ చేసిన సవరణ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. రాజ్యాంగం ముందుమాట (ప్రియాంబుల్)ను ఇంత వరకు ఒకే ఒక్కసారి ఇందిరా గాంధీ సవరించారు. 1976లో ఎమర్జెన్సీ విధించినప్పుడు రాజ్యాంగానికి 42వ సవరణ చేయటం గమనార్హం. ఆమె నియమించిన సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ప్రియాంబుల్‌తోపాటు రాజ్యాంగంలోని పలు అంశాలను సవరించాలని సిఫారసు చేసింది. ఆ సిఫారసుల ఆధారంగా రాజ్యాంగంలోని ముందుమాటలో ‘లౌకికవాదం, సామాజిక’ అనే పదాలు వచ్చాయి. దీంతో పాటు దేశ సమైక్యత అనే పదానికి సమగ్రత అనే పదాన్ని జోడించారు. రాజ్యాంగంలో లౌకిక, సమాఖ్య, సోషలిస్ట్ అనే పదాలను పొందుపరచాలని ప్రొఫెసర్ కె.టి.షా కాన్‌స్టిట్యూయెంట్ శాసన సభలో రాజ్యాంగం రూపకల్పనపై జరుగుతున్నప్పుడు డిమాండ్ చేయగా రాజ్యాంగ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు అంబేద్కర్, నెహ్రూ గట్టిగా వ్యతిరేకించారు. భావితరాలను ఈ ఆలోచనలకు కట్టివేయటం మంచిది కాదంటూ వారు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. నెహ్రూ, అంబేద్కర్ తిరస్కరించిన లౌకికవాదం అంశాన్ని ఇందిరా గాంధీ రాజ్యాంగంలో ఎందుకు పొందుపరిచారనేది ప్రశ్న. భారత జాతీయ వాదానికి ఉన్న మతపరమైన గతాన్ని తిరస్కరించేందుకే లౌకిక వాదం అనే పదాన్ని ఇందిర రాజ్యాంగంలో పొందుపరిచారు.
కాంగ్రెస్ ప్రభుత్వాలు లౌకికవాదం అంటూనే ముస్లిం పర్సనల్ చట్టాన్ని అమలు చేయటం ఇందుకు ప్రబలమైన ఉదాహరణ. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో లౌకికవాదం, సోషలిజం అనే పదాలను చొప్పించటంతోపాటు పలు ఆర్టికల్స్‌ను సవరిస్తూ ఇందిర తీసుకున్న నిర్ణయాలను ఆ తరువాత జనతా పార్టీ ప్రభుత్వం మార్చేందుకు ప్రయత్నించింది. కొన్ని మార్పులు చేయగలిగినా లౌకికవాదం, సోషలిజం అనే పదాలను రాజ్యాంగం నుండి తొలగించలేకపోయింది. లౌకికవాదం అనేది మెజారిటీ ప్రజలను అణచివేసి, మైనారిటీ వర్గాలను భుజాలపై ఎక్కించుకునేందుకు మాత్రం పనికొచ్చింది. మెజారిటీ ప్రజలకు మద్దతు గా మాట్లాడితే మతతత్వం అవుతుంది, మైనారిటీలకు మద్దతుగా మాట్లాడితే లౌకికవాదం అనే విధంగా పరిస్థితులను సృష్టించారు. భాజపాను తిడితే లౌకికవాదులు, మోదీతో కలిస్తే మతతత్వవాదులు.. ఇదీ మన ప్రతిపక్ష పార్టీలు చేసిన కుట్ర. లౌకికవాదం పేరుతో మెజారిటీ ప్రజలను దెబ్బతీసే కుట్ర ఈ దేశంలో చాలా ఏళ్ల నుండి కొనసాగుతోంది. ఈ కుట్రను వమ్ము చేయాలంటే ఇందిరా గాంధీ చొప్పించిన లౌకికవాదం, సోషలిజం అనే పదాలను రాజ్యాంగం నుండి తొలగించి, అలనాడు రాజ్యాంగ నిర్మాతలు పొందుపరిచిన ప్రియాంబుల్‌ను పునరుద్ధరించాలి. ఈ లక్ష్యసాధన కోసం మోదీ ప్రభుత్వం ప్రయత్నించాలి. *

కె.కైలాష్ 98115 73262