బిజినెస్

రెండోరోజూ సెనె్సక్స్ పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం బలపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ వరుసగా రెండో రోజు బుధవారం తన ర్యాలీని కొనసాగించి 350 పాయింట్లు పుంజుకుంది. ప్రపంచ స్టాక్ మార్కెట్లలో సానుకూల ధోరణి నెలకొన్న తరుణంలో హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఆర్‌ఐఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు రాణించడంతో సెనె్సక్స్ బాగా పైకి ఎగబాకింది. సెనె్సక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే బుధవారం 349.76 పాయింట్లు (0.85 శాతం) పుంజుకొని, 41,565.90 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ ఇంట్రా-డేలో 41,671.86 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అదేవిధంగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే బుధవారం 93.30 పాయింట్లు, (0.77 శాతం) పెరిగి, 12,201.20 పాయింట్ల వద్ద స్థిరపడింది.
సెనె్సక్స్ ప్యాక్‌లోని షేర్లలో హెచ్‌యూఎల్ బుధవారం అత్యధికంగా లాభపడింది. ఈ కంపెనీ షేర్ విలువ అయిదు శాతం పుంజుకుంది. కోటక్ బ్యాం క్, నెస్ట్‌లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్ర అండ్ మహీంద్ర, ఆసియన్ పెయింట్స్, రిల్ తరువాత స్థానాల్లో నిలిచాయి. మరోవైపు ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ షేర్ల విలువ 1.34 శాతం వరకు పడిపోయింది. కరోనా వైరస్‌కు సంబంధించి భయాందోళనలు నెలకొని ఉన్నప్పటికీ, ప్రపంచ స్టాక్ మార్కెట్ల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లకు సానుకూల సంకేతాలు అందాయని వ్యాపారులు చెప్పారు. బుధవారం తరువాత విడుదల య్యే ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాల కోసం ఇనె్వస్టర్లు వేచి చూశారని వారు తెలిపారు. షాంఘై, హాంకాంగ్, టోక్యో, సియోల్ స్టాక్ మా ర్కెట్లు కూడా బుధవారం లాభాలతో ముగిశాయి. ఐరోపా స్టాక్ మార్కెట్లూ సానుకూల ధోరణిలో ప్రా రంభమయ్యాయి. ఇలా ఉండగా, బ్రెం ట్ ముడి చ మురు ఫ్యూచర్స్ ధర 2.20 శాతం పెరి గి, ఒక బారెల్‌కు 55.20 డాలర్లకు చేరుకుంది. ఇది లా ఉండగా, ఇంట్రా-డేలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 4పైసలు తగ్గి, 71.32కు చేరుకుంది.