Others

ఈనాడే బాబూ.. (నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్వీ రంగారావు, రాజ్‌బాబు తాతామనవడుగా నటించిన చిత్రంలో అంజలీదేవిపై చిత్రీకరించిన ‘ఈనాడే బాబూ నీ పుట్టినరోజు’ అనే పాట చాలా బావుంటుంది. సినారె కలంలోనుండి జాలువారి, పి.సుశీల గళంలోనుండి వినిపించే ఈ పాట ఎప్పుడు విన్నా కొత్తగానే ఉంటుంది. కొడుకు ఇంట్లోనే కోడలికి తెలియకుండా పనిమనిషిగా బ్రతుకుతూ తన సొంత మనవడైనా, గుండెకు హత్తుకోలేని బేలత్వం ఆమెది. మనవడిపై ప్రేమ చూపిస్తే కోడలు ఏమంటుందో తెలియని అమాయకురాలు. కానీ ప్రేమ పాశాన్ని వదులుకోలేదు. కొడుకంటూ ఒకడున్నా వాడు గుండెల్ని ఏనాడో అమ్ముకున్నాడు. కోడలు పంచన చేరి తల్లిదండ్రుల్ని మర్చిపోయాడు. ఇంటికి పనిమనిషిగా వచ్చిన తల్లిని చూసి జాలిపడకపోగా ఈ విషయాన్ని కోడలికి చెప్పొద్దన్నాడు. ఎవరేమంటే ఏమి? నా కొడుకు నా మనవడింట్లోనే కదా నే పనిచేస్తుంది అని సమాధాన పడిపోయింది ఆ మాతృమూర్తి. తల్లీతండ్రీ పుట్టినరోజుకి పాట పాడినా ఆ చిన్నబాబుకి నచ్చలేదు. తననెంతో ఆప్యాయంగా పెంచి పెద్దచేస్తున్న ఆయమ్మ అనబడే నానమ్మనే పాట పాడమన్నాడు బాబు. అందుకే పెద్దలు సుద్దులు చెప్పినట్లుగా ఈ పాటలో రాముడి గురించి చక్కగా మనవడికి వివరించి చెబుతుంది. తండ్రి మాటకోసమే తనయుడు అడవులపాలయ్యాడని, అందుకే ఆయన అందరికీ దైవమయ్యాడని చెబుతుంది. చుక్కలు వేయి ఎందుకు, ఒక్క చంద్రుడే చాలు, తల్లిదండ్రులను చూసే కొడుకు ఒక్కడే చాలు. తన స్వార్థం, సుఖం చూసుకున్న కొడుకు ఎక్కడున్నా ఆనందంగా ఉంటే చాలు అని ఆనందపడుతుంది ఆ తల్లి. చిన్నబాబు పెరుగుతుంటే కన్నవారికి ఆనందం. అలాగే ఆకాశంలో నెలవంక పెరిగితే నింగికి ఒక అందం అని చక్కని ఉపమానాలతో ఈ పాటను రాశారు సినారె. పాట వినడానికి ఎంత మధురంగా ఉంటుందో, అక్కడ సన్నివేశం అంత భావగర్భితంగా ఉంటుంది. ఈ రెండిటినీ సమన్వయం చేస్తూ తన తొలి చిత్రంతోనే అద్భుతాన్ని సృజియించారు దర్శకుడు దాసరి నారాయణరావు. తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులకు ఈ సినిమాకానీ ఈ పాట కానీ చూపిస్తే సిగ్గుతో తల వంచుకుంటారు. అది ఈ పాటలో ఉన్న గొప్పతనం.
- మేడా శ్రీనివాసరావు, ఎడ్చెర్ల