కడప

సిఎం చంద్రబాబు పర్యటన విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఏప్రిల్ 25 : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం నాటి జిల్లా పర్యటన విజయవంతమైంది. ఓ పక్క మండుటెండ, మరో పక్క వడగాలులు మధ్య ఆయన పలుసభలు,సమావేశాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో బిజీబిజీగా పాల్గొన్నారు. పర్యటన విజయవంతం కావడంతో అటు నేతలు, ఇటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన కోడూరు , రాయచోటి, కడప నియోజకవర్గాల్లో పర్యటించారు. కోడూరులో ఇటీవల ఆకస్మికంగా మృతి చెందిన మాజీ ఎంపి గునిపాటి రామయ్య స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామాపురం మండలంలోపర్యటించి నీరు-చెట్టు , పంటసంజీవిని కార్యక్రమాన్నిప్రారంభించి అక్కడ జరిగిన సభలో పాల్గొన్నారు. సభలో నాయకులకు చురకలు వేయడంతో పార్టీ కార్యకర్తలు, నేతల్లో గందరగోళం నెలకొంది. అనంతరం ఆయన కడపకు చేరుకుని ఓ ప్రైవేట్ కనె్వన్సన్ హాల్‌లో నీటి వినియోగదారుల సంఘ ప్రజాప్రతినిధులతో సమావేశమై చెరువులు, కుంటలు, కాలువలు, చెక్‌డ్యామ్‌లు, కోనేటి గుంతలు, డక్‌ఔట్ ఫాండ్లు పూడిక తీయించాలని సూచించారు. చెరువుల్లో మొక్కలు లేకుండా ఏరివేసి ఈమారు వచ్చే వర్షాకాలంలో నీరు వృధాకాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి కార్యాలయం, ప్రతి ఇంటిలో చిన్నపాటి ఇంకుడు గుంతలు తీసి వర్షపునీటిని సద్వినియోగం చేయాలన్నారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల అధికారులతో సమావేశమై ఏ స్థాయిలో ఉన్నాయోనని అడిగి తెలుసుకున్నారు. అడిగి కొంతమంది అధికారులకు హెచ్చరికలు జారీ చేసి ప్రాజెక్టు నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా కావాల్సిన నిధులు సమకూరుస్తామని చెప్పారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి ఊటుకూరు రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ మేడా వెంకటమల్లికార్జునరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడు, టిడిపి జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు), పౌరసరఫరా అభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్ ఎం.లింగారెడ్డి, ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ ఎంపి ఎస్.పాలకొండ్రాయుడు, ఎమ్మెల్యేలు సి.ఆదినారాయణరెడ్డి, పి.జయరాములు, మాజీ ఎమ్మెల్యేలు ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి, ఎన్.వరదరాజులురెడ్డి, టిటిడి బోర్డు సభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్, కె.విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.

సిఎం పర్యటన సాగిందిలా...
రాయచోటి, ఏప్రిల్ 25: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నాడు రాయచోటి నియోజక వర్గంలోని రామాపురం మండలంలో విస్తృతంగా పర్యటించారు. మధ్యాహ్నం 2.25 గంటలకు ఆదర్శ పాఠశాల సమీపంలోని హెలిప్యాడ్‌లో దిగారు. అనంతరం 2.30 గంటలకు రామాపురం మండలంలోని రామరాజు వంకలో చేపట్టిన పనులను పరిశీలించారు. 2.40 గంటలకు బిల్లిగుట్ట చెరువుకు చేరుకుని జెసిబితో మట్టిని తవ్వారు. 2.50 గంటలకు బహిరంగ సభలో రైతులనుద్దేశించి ప్రసంగించారు. 3.20 గంటలకు పంట సంజీవని పరిశీలించి ఉపాధి కూలీలతో మాట్లాడారు. అనంతరం తిరిగి హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట జిల్లా టిడిపి అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి రమేష్ కుమార్ రెడ్డి, జిల్లా నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు ఉన్నారు. ముఖ్యమంత్రి సభలో మాజీ ఎంపి, మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు, మాజీ జడ్పీ చైర్మన్ బాలసుబ్రమణ్యం, ప్రసాద్ బాబు, ఆర్‌ఆర్ సోదరులు ఒకే వేదికపైకి రావడంతో అంతా ఆసక్తిగా చూశారు.