అనంతపురం

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంబదూరు, మే 3 : మండల పరిధిలోని చిట్టేపల్లి గ్రామానికి చెందిన వడ్డే రైతు నారాయణప్ప (42) మంగళవారం గ్రామ సమీపంలోని వ్యవసాయతోటలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు సుమారు రూ.5 లక్షల దాకా అప్పులు చేసి పంట పెట్టాడు. అయితే సక్రమంగా పంట చేతికి అందకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ నగేష్ తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

యువతి ఆత్మహత్య
గుత్తి, మే 3 : మున్సిపాలిటీ పరిధిలోని సిపిఐ కాలనీకి చెందిన కృష్ణవేణి (19) మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబంలో తలెత్తిన మనస్పర్థల కారణంగా పెద్దలు మందలించడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగు మందు తాగింది. అపస్మారక స్థితిలోకి చేరిన ఆమెను గుత్తి ప్రభుత్వాసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. గుత్తి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
చెనే్నకొత్తపల్లి, మే 3: ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన చెనే్నకొత్తపల్లిలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు చెనే్నకొత్తపల్లి గ్రామానికి చెందిన గోపి, రామచంద్రలు పనినిమిత్తమై పెనుకొండ వైపుకు వెళ్ళారు. అయితే తిరిగి చెనే్నకొత్తపల్లికి వస్తుండగా చెనే్నకొత్తపల్లి వద్ద వున్న వై జంక్షన్‌కు రాగానే ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో గోపి(25) అక్కడికక్కడే మృతి చెందాడు. రామచంద్రకు గాయాలయ్యాయి. చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సికెపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.