రాశిఫలం 06-05-2016

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిథి: 
బహుళ అమావాస్య రా.1.03
నక్షత్రం: 
అశ్విని ఉ.9.42
వర్జ్యం: 
ఉ. 5.58 నుండి 7.27 వరకు తిరిగి సా.6.38 నుండి 8.07 వరకు
దుర్ముహూర్తం: 
ఉ.8.34 నుండి మ.12.24 తిరిగి మ12.24నుండి 1.12
రాహు కాలం: 
ఉ. 10.30 నుండి 12.00
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) కలహాలకు అవకాశముంటుంది. చెడు సహ వాసానికి దూరంగా ఉండాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలనుభవిస్తారు.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) కొన్ని పనులు ఆలస్యంగా ప్రారంభిస్తారు. ప్రయా ణాలుంటాయ. చంచలం అధికమవుతుంది. గృహంలోమార్పులుంటాయ. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయ.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయుటకు వెనుకాడరు. ఋణబాధలు తొలగిపోతాయ. శత్రుబాధలుండవు. ధనలాభముంటుంది. నూతన వస్తుఆభరణాలు పొందుతారు.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశే్లష) ప్రయత్న కార్యాలకు ఆటంకాలుంటాయ. బంధుమిత్రులతో విరోధం వచ్చే అవకాశం ఉంటుంది. స్ర్తీమూలకంగా లాభం ఉంటుంది. ఏదోఒక విషయం మనస్తాపం కలిగిస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) విదేశీయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబకలహాలకు తావీయరాదు. ధననష్టం ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగరంగాల్లోని వారికి ఆటంకాలెదురవుతాయ. ఆరోగ్యం గూర్చి శ్రద్ధ అవసరం.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) కష్టాలన్నీ క్రమేణా తగ్గిపోతాయ. నూతన కార్యాలకు శ్రీకారం చుట్తారు. కుటుంబసౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. గొప్పవ్యక్తిని కలుస్తారు.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) ఋణప్రయత్నాలు ఫలిస్తాయ. అనారోగ్యబాధ లుంటాయ. బంధుమిత్రులతో విరోధంరాకుండా చూసుకోవాలి. వ్యవహారంలో ఇబ్బందులు ఏర్పడ వచ్చు. ప్రయత్నకార్యాలు విఫలమవుతాయ. అను కొన్న పనులు ఆలస్యంగా పూర్తిచేస్తారు.
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయ. ధననష్టం ఏర్పడవచ్చు. వృధాప్రయా ణాలెక్కువ. వృత్తివుద్యోగాల రంగాల్లో సహనం వహించాలి.ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. దైవ ప్రార్థన చేస్తారు.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.,) నూతన వ్యక్తులను నమ్మరాదు. సంఘంలో గౌరవం పొందేటట్టుగా వ్యవహరించాలి. అనుకొన్న పనుల్లో ఆటంకాలతో ఇబ్బంది ఏర్పడుతుంది. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) కుటుంబంలో సుఖసంతోషాలుంటాయ. ధనధా న్యాభివృద్ధి జరుగుతుంది. ఆటంకాలు ఎదుర యనా అనుకొన్న కార్యాలు పూర్తిచేస్తారు. మా ర్పులు సంతృప్తినిస్తాయ. ఋణప్రయత్నాలు ఫలిస్తాయ. అనుకోని లాభాలు వస్తాయ.
కుంభం: 
(్ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) ప్రయత్నం మేరకు స్వల్పలాభముంటుంది. వృధా ప్రయాణాలెక్కువ. వ్యాపారరంగంలో లాభాలుం టాయ. ఋణ యత్నాలు ఫలిస్తాయ. నూతన కార్యాలకు శ్రీకారం చుట్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది.
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) వృత్తిరీత్యా అనుకూల స్థాన చలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులుంటాయ. పోట్లాటలకు దూరంగా ఉండాలి. అనారోగ్యబాధలుంటాయ. ఔషధ సేవ తప్పని సరి. స్థిరాస్థుల వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించాలి. దైవం అనుకూలంగా ఉన్నా అన్నింటా జాగరూకులై ఉండాలి.
Date: 
Friday, May 6, 2016
author: 
- గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి