సంజీవని

వాపు మాటున ప్రాణాంతక వ్యాధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెపటైటిస్ అంటే కాలేయానికి వచ్చే ఇన్‌ఫెక్షన్. దీనికి హెపటైటిస్ ఎ, బి, సి, ఇ లతోపాటు మలేరియా వంటి అనేక కారణాలు వుంటాయి. ఆల్కహాల్ కూడా ఒక కారణం. ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 కోట్లమంది హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి వ్యాధుల బారిన పడుతున్నారు. పై సమస్యలకు చికిత్స చేయించుకోకపోవడంవల్ల క్రమంగా అవి లివర్ సిర్రోసిస్ లేదా లివర్ క్యాన్సర్, లివర్ ఫెయిల్యూర్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. ప్రతి పనె్నండు మందిలో ఒకరు హెపటైటిస్ సంబంధ సమస్యలకు గురవుతున్నారు.
మన శరీరంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించే అతి పెద్ద అవయవం కాలేయం. కాలేయం దాదాపు 1.5 కిలోల బరువుతో, అత్యంత సంక్లిష్టమైన నిర్మాణంతో వుంటుం ది. ఈ కాలేయానికి వచ్చే వాపు, ఇన్‌ఫ్లమేషన్‌ను హెపటైటిస్ అంటారు. దీనికి ఆల్కహాల్‌తో పాటు హెపటైటిస్-ఎ, హెపటైటిస్-బి, హెపటైటిస్-సి లేదా హెపటైటిస్-ఇ వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్స్ కారణాలు కావచ్చు.
సాధారణ లక్షణాలు
స్వల్పకాలిక హెపటైటిస్‌లో
కళ్ళు పచ్చగా మారడం, మూత్రం పసుపు పచ్చగా రావడం, బలహీనత, ఆకలి మందగించడం, వాంతులు, వికారం, జ్వరం, పొట్ట పైభాగంలో నొప్పి, శరీరంపై దురదలు రావడం వంటివి జరగవచ్చు. తీవ్రత ఎక్కువగా వున్న కొందరిలో అయోమయం (కన్‌ఫ్యూజన్), నిద్రమత్తుగా వుండటం, కోమాలోకి వెళ్ళడం కూడా జరగవచ్చు.
దీర్ఘకాలిక హెపటైటిస్‌లో..
పై లక్షణాలు ఏవీ కనిపించకపోవచ్చు. అయితే సమస్య అకస్మాత్తుగా మొదలైనట్లు అనిపించవచ్చు. రక్తహీనత, కామెర్లు, పొట్ట పెరగడం, కాళ్ల వాపులు, అయోమయం, రక్తపు వాంతులు, మలం నల్లగా రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు
పరీక్షలు
-కళ్ళు పసుపుపచ్చగా మారడం, జ్వరం, కాలేయం- స్ప్లీన్ పెరగడం, వణుకు, అయోమయం, పొట్ట పెరిగినట్లుగా వుండటం, కాళ్ళ వాపులు అనేవి బాహ్యంగా రోగుల్లో గమనించాల్సిన అంశాలు.
-హెపటైటిస్-బి, హెపటైటిస్-సి ఇన్‌ఫెక్షన్స్‌లో వ్యాధి వచ్చాక కూడా ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ఈ రెండు రకాల వ్యాధులలోనూ అవి 15 నుంచి 20 ఏళ్ళ తర్వాత తిరగబెట్టే అవకాశం ఉంది.
-లివర్ ఫంక్షన్ పరీక్షలు చేయించడంవల్ల లివర్ నుంచి స్రవించే ఎంజైములు (ఎఎస్‌టి, ఎఎల్‌టి వంటివి) పాళ్ళు పెరిగి కనిపిస్తాయి. రోగులలో బాహ్య లక్షణాలు ఏవి కనిపించకపోయినా, ఎల్‌ఎఫ్‌టి పరీక్ష ద్వారా ఎంజైములు పెరగడం తెలుస్తుంది. అప్పుడు ఈ పేషెంట్లలో హెపటైటిస్-బి లేదా హెపటైటిస్-సి పరీక్షలు చేయించాలి.
-హెపటైటిస్‌కు మలేరియాను ఒక కారణంగా గుర్తించి దానికి అవసరమైన పరీక్షలు చేయించి ఒకవేళ అవే కారణమైతే దానికి తగిన మందులు వాడాలి. ఒకవేళ హెపటైటిస్‌కు అది కారణం కాకపోతే ఇతర కారణాలను అనే్వషించాలి.
చికిత్స
ఆల్కహాల్ మానేయడం, ఏవైనా మందులు తీసుకుంటుంటే అవి మానడమే ఒక చికిత్స. కళ్ళు పచ్చబారి కనిపించే కామెర్లు రెండు నుంచి మూడు వారాలపాటు తీవ్రంగా ఉండటం, ఆ తర్వాత మరో రెండు నుంచి మూడు వారాల్లో తగ్గుముఖం పట్టడం జరుగుతుంది. హెపటైటిస్-ఎ, హెపటైటిస్-ఇ వ్యాధుల్లో ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం వుండదు. అయితే తేలిగ్గా జీర్ణమయ్యే పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం అవసరం.
హెపటైటిస్ వచ్చేందుకు కారణాలు
-హెపటైటిస్-ఎ, హెపటైటిస్-బి, హెపటైటిస్-సి, హెపటైటిస్-ఇ వైరల్ కారణంగా లేదా బ్యాక్టీరియా ఇతర పరాన్నజీవుల ఇన్‌ఫెక్షన్స్‌వల్ల హెపటైటిస్ (కాలేయపు) రావచ్చు.
-ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, కొన్ని రకాల మందులు వాడటం రసాయనాలు, విషపదార్థాలు..
-్ఫ్యటీ లివర్ అనే సమస్య క్రమంగా కాలేయపు వాపు (హెపటైటిస్)కు దారితీయవచ్చు.
-మనలో వ్యాధి నిరోధక శక్తిని కలిగించే కణాలు సొంత కాలేయంపై దెబ్బతీసే ఆటో ఇమ్యూన్ వ్యాధులవల్ల...
-కొన్ని రకాల జన్యుపరమైన వ్యాధులవల్ల కాలేయంలో రాగి, ఇనుము పేరుకుపోవడంవల్ల...
-అసెటామినోఫెన్ వంటి మందులను మితిమీరిన మోతాదులో తీసుకోడం కొన్ని రకాల చెట్లు, బెరళ్ళు, మందులు, విషపూరితమైన పుట్టగొడుగుల వంటి వాటిని మోతాదుకు మించి తీసుకోవడంవల్ల...
వైరస్‌లతో వచ్చే హెపటైటిస్‌లు...
హెపటైటిస్ -ఎ: కలుషితమైన ఆహారం, నీళ్ళు తీసుకోవడంవల్ల ఈ రకం హెపటైటిస్ వస్తుంది. కామెర్లు, వాంతులు, జ్వరం, ఆకలి లేకపోవడం, నాలుకకు రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. కొందరిలో దురదలు కూడా ఉండవచ్చు. కామెర్లు కనిపించడానికి ముందుగా జ్వరం, ఒళ్ళునొప్పులు, తలనొప్పి, ఫ్లూ జ్వరంలో లక్షణాలు వుండవచ్చు. రెండుమూడు వారాల్లో కామెర్లు రెండు వారాలపాటు అలా కొనసాగి.. క్రమంగా తగ్గుముఖం పట్టి మరో రెండు మూడు వారాల్లో పూర్తిగా తగ్గుతాయి.
హెపటైటిస్-ఇ: ఇది కూడా హెపటైటిస్- తరహాలోనే వ్యాప్తి చెందుతుంది. లక్షణాలు కూడా అలాగే వుంటాయి. ఈ వైరల్ ఇన్‌ఫెక్షన్స్‌లో కోలుకునేందుకు వ్యవధి దాదాపు మూడు నెలలు పట్టవచ్చు. దురదలు మరింత తీవ్రంగా ఉండవచ్చు.
హెపటైటిస్-బి: రోగికి వాడిన సూది మళ్లీ ఆరోగ్యకరమైన వ్యక్తికి వాడటంవల్ల, రేజర్లు, టూత్‌బ్రష్‌లు షేర్ చేసుకోవడంవల్ల, రోగికి ఉపయోగించిన సూదులతో ఇంకొకరికి చెవులు కుట్టడం, పచ్చబొట్టు (టాటూ) వేయడం లేదా కలుషితమైన రక్తాన్ని ఎక్కించడం వంటి మార్గాలవల్ల రోగి నుంచి ఆరోగ్యకరమైన వ్యక్తికి వస్తుంది. వ్యాధి వున్న వ్యక్తితో సెక్స్‌వల్ల కూడా వస్తుంది. ఇది వచ్చిన వారిలో కామెర్లతో మిగతా హెపటైటిస్-ఎకు సంబంధించిన లక్షణాలన్నీ అంటే, జ్వరం, వాంతులు, ఆకలి లేకపోవడం, నాలుకకు రుచి తెలియకపోవడం.. అన్నం సహించకపోవడం వంటివి కనిపించవచ్చు. చాలామట్టుకు కేసుల్లో దీనికి యాంటీవైరల్ మందులు వాడాల్సిన అవసరం లేదు. 90శాతం రోగుల్లో ఇది ఆరేళ్లలో దానంతట అదే తగ్గిపోయి పరీక్షలు చేస్తే నెగెటివ్ అని రిజల్డ్ వస్తుంది. హెచ్‌బీఎస్‌ఏజీ అనే పరీక్షవల్ల హెపటైటిస్-బి బయటపడుతుంది. ఒకసారి వైద్యపరీక్షల్లో హెచ్‌బిఎస్‌ఏజీ అనే రిపోర్టు పాజిటివ్‌వస్తే వాళ్ళకు పూర్తిస్థాయి లివర్ పరీక్షలు చేయించాలి. లివర్ ఫంక్షన్ టెస్ట్ (ఎల్‌ఎఫ్‌టి) పరీక్షలు ప్రతి ఆర్నెల్లకోమారు చేయించాలి. ఆ పరీక్షల్లో మళ్లీ ఏదైనా అబ్‌నార్మాలిటీ వుంటే, అంటే ఎస్‌జపీటి (ఏఎల్‌టి) ఎక్కువగా వుంటే వాళ్ళు మరికొన్ని రక్తపరీక్షలు చేయించుకోవాలి. వైరస్ చురుగ్గా వుండి దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, యాంటీ వైరల్ డ్రగ్స్ వాడాల్సిన అవసరం వుంటుంది. సాధారణంగా హెచ్‌బిఎస్‌ఏజీ పాజిటివ్ రిపోర్టులు వుండి ఎల్‌ఎఫ్‌టి అల్ట్రాసౌండ్ రిపోర్టులు నార్మల్‌గా వచ్చిన సందర్భాల్లో ప్రతి ఆర్నెలకోమారు లివర్ ఫంక్షన్ టెస్ట్‌లు చేస్తుంటారు. అవి నార్మల్‌గా వున్నవాళ్ళకు ఎలాంటి మందులు వాడరు. కానీ దీర్ఘకాలిక హెపటైటిస్-బి వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే... దాన్ని నివారించుకోవడం, నివారణకు తోడ్పడుతుంది. హెపటైటిస్-బి వచ్చిన వారి భార్య/్భర్తకు, కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు జరిపి వాళ్ళకు ఆ వ్యాధిలేని సందర్భాల్లో వ్యాక్సిన్ తీసుకోవడం సత్ఫలితాలనిస్తుంది.
హెపటైటిస్-సి: ఇటీవల ఈ వైరస్ దీర్ఘకాలిక లివర్ సమస్యలకు దారితీసేందుకు కారణమవుతుంది. దురదృష్టవశాత్తు హెపటైటిస్-ఎ వైరస్‌కు ఇంకా వాక్సిన్ రూపొందలేదు. హెపటైటిస్-బిలా కాకుండా ఇది చాలా నెమ్మదిగా దీర్ఘకాలిక (క్రానిక్) సమస్యగా లేదా సిర్రోసిస్‌గా లేదా లివర్ క్యాన్సర్‌గా మారుతుంది. కేవలం లివర్ ఫంక్షన్ టెస్ట్ (ఎల్‌ఎఫ్‌టి) మాత్రమే హెపటైటిస్‌ని నిర్థారణ చేయలేకపోవచ్చు. అందుకే హెపటైటిస్-సి యాంటీ బాడీస్ పరీక్షలో పాజిటివ్ వున్నవాళ్ళు అల్ట్రాసౌండ్ అబ్దామిన్, హెచ్‌సివీ-ఆర్‌ఎస్‌ఏ క్వాంటిటేటివ్ ఎస్సే, జీనోటైపింగ్ పరీక్షలు చేయించాలి.
దీనికి చికిత్స విధానాలు హెపటైటిస్-బితో పోల్చినపుడు చాలా పరిమితంగా వున్నాయి. అంతగా ప్రభావపూర్వకమైనవి కావు. వైరల్ జీనోటైప్‌ను బట్టి దీనికి రిబావెరిన్‌తోపాటు పెగిలేటెడ్ ఇంటర్‌ఫెరాన్ వంటి మందులను 24 నుంచి 48 వారాలపాటు వాడాల్సి వుంటుంది. ఇది కూడా హెపటైటిస్-బి లాగానే వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఇంజెక్షన్లు వాడటంలో సురక్షిత మార్గాలను అనే్వషించడంతోబాటు సెక్స్ సమయంలో కండోమ్ వాడటం వంటి సురక్షిత చర్యలు అవసరం.